సెలవు దొరికితే సమంత ఏం చేస్తుందో చూసారా?
మయోసైటిస్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత ఇటీవల తన కెరీర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
మయోసైటిస్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత ఇటీవల తన కెరీర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. `సిటాడెల్- హనీ బన్నీ` కోసం రెండేళ్ల పాటు శ్రమించిన సమంతకు ఈ వెబ్ సిరీస్ ఆశించిన సత్ఫలితాన్ని అందించింది. ప్రస్తుతం `మా ఇంటి బంగారం` సినిమాలో నటిస్తూనే, `రక్త్ బ్రహ్మాండ్` చిత్రీకరణలో పాల్గొంటోంది.
వరుస షెడ్యూళ్లతో అలసిపోతున్నా దానిని ఎంతమాత్రం ఖాతరు చేయని స్వభావం తనది. అందుకేనేమో.. ఇప్పుడిలా కొంచెం తీరిక దొరకగానే సేద తీరుతోంది. అలా తాపీగా దుప్పటి కప్పుకుని లేజీగా ఒళ్లు విరుచుకుని నిదురిస్తుంటే ఆ హాయే వేరు. సమంత పసిపిల్లలా ఈ సెలవు దినాన్ని ఆస్వాధిస్తోంది.
ఇక సమంత నిదురిస్తున్న ఆ గది ఎంతో అందంగా ఆహ్లాదకరంగా డెకరేట్ చేసి ఉంది. పరిసరాల్లో క్రిస్మస్ ట్రీ, పువ్వులు, అందమైన పూజా గది.. వినాయక విగ్రహం.. ఇదంతా చూస్తుంటే.. సమంత ఓవైపు క్రిస్మస్ సెలవుని ఆస్వాధిస్తూనే మరోవైపు వినాయక పూజలాచరిస్తోందని కూడా అర్థమవుతోంది. హిందూ, క్రిస్టియన్ స్టైల్ లో సమంత డివోషనల్ ప్రణాళికల్ని ఇది ఆవిష్కరిస్తోంది.
సమంత ఉన్న గదిలోనే ఓ చిత్ర పటంలో ఫ్రేమ్‌లో బలమైన మహిళల గురించి స్పూర్తిదాయకమైన కోట్ కూడా రాసి ఉంది. `మేం దీన్ని చేయగలం` అనే కోట్ సమంత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తోంది. క్యాప్షన్ లో ఒక నిగూఢమైన అంశాన్ని ప్రస్థావించింది. కొన్ని సమయాల్లో ఎలాంటి ప్రణాళికలు లేకుండా కేవలం కూర్చుని సమయాన్ని ఇష్టానుసారం ఆస్వాధించడం సరైంది కాదని సామ్ అభిప్రాయపడింది.
సమంతా చివరిసారిగా `సిటాడెల్: హనీ బన్నీ`లో కనిపించింది. వరుణ్ ధావన్ ఇందులో కథానాయకుడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ కి పాజిటివ్ సమీక్షలు దక్కాయి. సమంత నటనకు ప్రశంసలు కురిసాయి. ఓటీటీలో ప్రస్తుతం హనీ బన్నీ అందుబాటులో ఉంది. `మా ఇంటి బంగారం` సినిమాని స్వయంగా నిర్మిస్తున్న సమంత.. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న రక్త్ భ్రహ్మాండ్ లోను నటిస్తోంది.