మెడిటేషన్ గురించి సమంత పాఠాలు
ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని అందరికీ తెలుసు. కానీ దాన్ని పాటించడానికి ఎవరికీ ఓపిక ఉండదు. ధ్యానం శరీరాన్ని, మనసుని ఏకీకృతం చేయడానికి సహాయపడుతుంది.
ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని అందరికీ తెలుసు. కానీ దాన్ని పాటించడానికి ఎవరికీ ఓపిక ఉండదు. ధ్యానం శరీరాన్ని, మనసుని ఏకీకృతం చేయడానికి సహాయపడుతుంది. విశ్రాంతి, ఏకాగ్రతను అందిస్తూ ఎమోషన్స్ ను అదుపులో ఉంచుకునేలా, స్ట్రాంగ్ డెసిషన్స్ ను తీసుకునేలా చేస్తుందని ధ్యానమనేది ఓ ఆధ్మాత్మిక అనుభవమని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ప్రతీరోజూ 15 నిమిషాలు మెడిటేషన్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సమంత సూచించింది. సైలెంట్ గా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని, దానికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ వెల్లడించింది. తన జీవితంలో మెడిటేషన్ చాలా బాగా వర్కవుట్ అయిందని, ప్రశాంతంగా ఉండటానికి ధ్యానాన్ని మించింది మరొకటి లేదని సమంత ఈ సందర్భంగా పేర్కొంది.
ప్రపంచం మొత్తం గందరగోళంగా ఉన్నా తను శాంతంగా ఉండటానికి కారణమదేనని, మీరు కూడా మెడిటేషన్ చేస్తే ఆ గందరగోళాల నుంచి శాంతి లభిస్తుందని సామ్ తెలిపింది. మీ మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వాటి గురించి ఆలోచించకుండా మెడిటేషన్ చేస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పిన సమంత, ప్రతీ ఒక్కరినీ మెడిటేషన్ చేయమని సూచించింది.
వారం రోజుల కిందట సమంత తాను ఓ మంచి అలవాటుని ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. గత రెండేళ్ల నుంచి తాను రెగ్యులర్ గా డైరీలో ఎవరికి, ఎందుకు గ్రేట్ ఫుల్ గా ఉండాలో, ఎవరికి థాంక్స్ చెప్పాలో, ఎందుకు చెప్పాలో రాసుకుంటూ వచ్చినట్టు తెలిపిన సమంత ఇప్పుడు మెడిటేషన్ చేయమని సలహా ఇస్తుంది.
ఇక కెరీర్ విషయానికొస్తే సమంత రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అది అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో మా ఇంటి బంగారం అనే సినిమా ఉంది. సొంత బ్యానర్ లో సమంతనే ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను సమంత అనౌన్స్ చేయలేదు.