ర‌కుల్ (X) స‌మంత‌: స్నేహ‌మంటే ఇదేరా

ఆ త‌ర్వాత స్క్రీన్ వెలుప‌లా స్నేహం మరింత బలపడింది. ఇన్నేళ్లుగా ఆ ఇద్దరూ మంచి స్నేహితులు.

Update: 2025-02-12 15:49 GMT

స్నేహాలు అశాశ్వతంగా ఉండే పరిశ్రమలో సమంత- రకుల్ బంధం ప్రత్యేకంగా నిలుస్తుంది. మన్మధుడు 2 లో ఇద్దరూ స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకున్నారు. ఇందులో సమంత ప్రత్యేక అతిధి పాత్రలో నటించగా, రకుల్ కథానాయికగా నటించింది. ఆ త‌ర్వాత స్క్రీన్ వెలుప‌లా స్నేహం మరింత బలపడింది. ఇన్నేళ్లుగా ఆ ఇద్దరూ మంచి స్నేహితులు.

ఇప్పుడు ఆ స్నేహం మ‌రింత ఉల్లాసక‌ర‌ క్షణాలను అభిమానులకు అందిస్తోంది. ర‌కుల్ న‌టించిన 'మేరే హస్బెండ్ కీ బివి' విడుదలకు సిద్ధమవుతుండగా ఈ సినిమా నుంచి పాట‌లు ఒక్క‌క్క‌టిగా విడుద‌ల‌వుతూ ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షిస్తున్నాయి. ఇప్పుడు స‌మంత త‌న స్నేహితురాలి కోసం ప్ర‌మోష‌న‌ల్ సాయాన్ని అందించింది. సామ్ ఓ ఆటోలో ప్ర‌యానిస్తూ అందులో 'గోరీ హై కలియాన్' పాటను ఆస్వాధిస్తూ కనిపించింది.

షార్ట్స్‌తో జ‌త‌గా చిక్ బ్లాక్ క్రాప్ టాప్ ధరించిన‌ సమంత స్టైలిష్‌గా కనిపించింది. ఆటో రైడ్ లో స‌ర‌దా క్ష‌ణాల‌ను ఆస్వాధించింది. ముసుగు ధరించి.. అందంగా నవ్వుతూ వెళుతూ.. కెమెరా వైపు చూపులు ప్ర‌స‌రిస్తూ కనిపించింది. రకుల్ ప్రీత్ 'క్యూటీ' అనే క్యాప్షన్‌తో క్లిప్‌ను తిరిగి పోస్ట్ చేసింది. వారి స్నేహం స్క్రీన్‌కు అతీత‌మైన‌ద‌ని ప్రూవ్ అయింది. అన్న‌ట్టు ర‌కుల్- స‌మంత క‌లిసి ఒక‌ పూర్తి స్థాయి సినిమాలో న‌టిస్తే చూడాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

'మేరే హస్బెండ్ కీ బివి' నుంచి 'గోరి హై క‌లియాన్' పాట‌ స‌మంతతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ వంటి క‌థానాయిక‌ల‌ మనసు దోచుకుంది. ఈ పాట‌లోని ఆకర్షణీయమైన లయను సెల‌బ్రిటీ భామ‌లు ఆస్వాధించకుండా వేచి ఉండలేరని ప్రూవైంది.

Tags:    

Similar News