సామ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. హిట్ పక్కానా..

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్ర పోషించిన ఆ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Update: 2025-02-02 06:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న సామ్.. రీసెంట్ గా ఆ సిరీస్ తో ఓ రేంజ్ లో అలరించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్ర పోషించిన ఆ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిటడెల్ లో సామ్.. తన యాక్టింగ్ తో ఓ రేంజ్ లో మెప్పించింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్- ది బ్లడీ కింగ్ డమ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ సిరీస్ మేకర్స్.. ఆదిత్య రాయ్ కపూర్ ను తమ సెట్స్ లోకి ఆహ్వానించారు.

రాజవంశ కుటుంబం నేపథ్యంలో రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. సామ్ యువరాణి రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఫాంటసీ సిరీస్ గా రూపొందుతున్న రక్త్ బ్రహ్మాండ్.. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుండగా.. రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. తుంబాద్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.

రక్త్ బ్రహ్మాండ్ ను ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్ సిరీస్ ల డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు. దీంతో మరోసారి సామ్.. రాజ్ అండ్ డీకే తో వర్క్ చేస్తున్నట్లు అయింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్ లో సమంత నటించిన విషయం తెలిసిందే. అయితే హిట్ కాంబో రిపీట్ అవుతుండడంతో.. రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ పై అప్పుడే మంచి అంచనాలు నెలకొన్నాయి.

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ లో విరోధి రాజి పాత్రలో కనిపించిన సమంత నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ పాత్ర చివరకు మరణించినప్పటికీ, ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సిటాడెల్ హనీ బన్నీతో కూడా సామ్ ప్రశంసలు దక్కించుకుంది. మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అని అంతా కొనియాడారు.

అయితే 2023లో ఖుషి, శాకుంతలం సినిమాలు తర్వాత దాదాపు రెండు సంవత్సరాలుగా సమంత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఓటీటీలో ఇప్పటికే మంచి ప్రశంసలు అందుకుంటున్నా.. సిల్వర్ స్క్రీన్ పై ఆమెను చూడడానికి మరికొంత సమయం వేచి ఉండాల్సి వస్తుందని అర్థమవుతుంది. మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చినా ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.

Tags:    

Similar News