.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

స‌మంత మ‌ళ్లీ మ‌ళ్లీ వీళ్ల‌తోనే ఏంటో

అయితే ఆ ప్ర‌క‌ట‌న ఒక వెబ్ సిరీస్ అవుతుంద‌ని, అది కూడా ఫ్యామిలీమ్యాన్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రాజ్ అండ్ డీకేతోనే మ‌రోసారి ప‌ని చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

Update: 2024-06-30 06:43 GMT

ఫిట్నెస్ ఫ్రీక్ స‌మంత రూత్ ప్రభు నిరంత‌రం త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో అందుబాటులో ఉంది. చికిత్స‌తో అనారోగ్యం నుంచి కోలుకున్న త‌ర్వాత త‌న నుంచి ఒక పెద్ద ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంతా వేచి చూసారు. అయితే ఆ ప్ర‌క‌ట‌న ఒక వెబ్ సిరీస్ అవుతుంద‌ని, అది కూడా ఫ్యామిలీమ్యాన్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రాజ్ అండ్ డీకేతోనే మ‌రోసారి ప‌ని చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

ఇంత‌లోనే వారి నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెబ్ లో విప‌రీతంగా ఆక‌ర్షించింది. ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్- హ‌నీబ‌న్ని వెబ్ సిరీస్ ల త‌ర్వాత స‌మంత‌తో తిరిగి మ‌రోసారి ప‌ని చేయ‌డానికి రాజ్ అండ్ డీకే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది వారికి ముచ్చ‌ట‌గా మూడోసారి కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

సిటాడెల్ - హ‌నీ బ‌న్నీ సిరీస్ ఇంకా ఓటీటీలో రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇంత‌లోనే స‌మంత మ‌రోసారి వెబ్ సిరీస్ కి ప‌చ్చ జెండా ఊప‌డం వెన‌క అస‌లు కార‌ణ‌మేమిటి? అంటే.. ఓటీటీ సిరీస్ ల‌లో న‌టించేందుకు స్కోప్ ఎక్కువ‌. గ్లామ‌ర్ అంశాల కంటే న‌ట‌న‌కు ఆస్కారం ఉంటుంది గ‌నుక త‌న మొద‌టి ప్రాధాన్య‌త‌గా మారింది. ఇక రాజ్ అండ్ డీకే ఇప్ప‌టికే మంచి స్నేహితులు అయ్యారు గనుక వారితో ప‌ని చేయ‌డం అంటే సుఖంగా ఉంటుంద‌ని అభిమానులు విశ్లేషిస్తున్నారు.

Read more!

రాజ్ & DK దర్శకత్వం వహించనున్న తాజా వెబ్ సిరీస్ టైటిల్ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `ర‌క్తబీజ్` పేరుతో భారీ యాక్ష‌న్ డ్రామాను వారు తెర‌కెక్కించ‌నున్నార‌ని, ఇందులో స‌మంత స్టంట్స్ చేస్తుంద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ వెబ్ సిరీస్ తో ఆదిత్య రాయ్ కపూర్ ఓటీటీ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు.

ది నైట్ మేనేజర్ తో విజయం అందుకున్న‌ ఆదిత్య గత ఆరు నెలలుగా రాజ్ అండ్ డీకేతో చర్చలు జరుపుతున్నాడు. తొలి వెబ్ సిరీస్ విజయం తర్వాత గ‌త‌ మేలో కొత్త ప్రాజెక్ట్‌కు తన ఆమోదం తెలిపాడు. ఇక స‌మంత‌- ఆదిత్యరాయ్ క‌ల‌యిక‌లో ఈ వెబ్ సిరీస్ ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇప్పటికే `రక్తబీజ్‌` చిత్రీక‌ర‌ణ‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ యాక్షన్-ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్ కాబట్టి సమంత, ఆదిత్య ఇద్దరూ తమ తమ పాత్రల కోసం సిద్ధమవుతున్నారు. రాజ్ & డికె `ది ఫ్యామిలీ మ్యాన్ 3` పనిని ముగించిన వెంటనే, ఆగస్ట్‌లో ఈ కొత్త‌ సిరీస్ చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారు. `సిటాడెల్: హనీ బన్నీ`లో వరుణ్ ధావన్ సరసన నటించిన స‌మంత ఇప్పుడు ఆదిత్యారాయ్ తో క‌లిసి న‌టించ‌నుండ‌డం ఆస‌క్తిగా మారింది. వ‌రుసగా బాలీవుడ్ యువ‌హీరోల స‌ర‌స‌న స‌మంత అవ‌కాశాలు అందుకుంటోంది.

Tags:    

Similar News