యాక్ష‌న్ 'రొమాంటిక్ సాంగ్‌'లా ఉంది: స‌మంత‌

ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స‌మంత అద్భుత స్పీచ్ తో ఆక‌ట్టుకుంది.

Update: 2024-08-01 16:55 GMT

''నేను యాక్షన్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఈ రోజు ఇది ఒక పెద్ద‌ విజ‌యం. ఎందుకంటే నేను చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ దీన్ని చేయగలనని అనుకోలేదు. అస‌లు సిటాడెల్‌లో భాగమవుతానని అనుకోలేదు. నిజంగా నన్ను రక్షించినందుకు రాజ్ అండ్ డికెకి కృతజ్ఞురాలిని'' అని అన్నారు స‌మంత రూత్ ప్ర‌భు. స‌మంత - వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ్ అండ్ డీకే రూపొందించిన 'సిటాడెల్ : హ‌నీ బ‌న్నీ' త్వ‌ర‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్ప‌టికే టీమ్ ప్ర‌చారంలో జోరు మీద ఉంది.

ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స‌మంత అద్భుత స్పీచ్ తో ఆక‌ట్టుకుంది. వ‌రుణ్ తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా ఆనందాన్నిచ్చింది. మేం క‌లిసి యాక్షన్ చేసినప్పుడు అది ఒక నృత్యంలాగా అనిపించింది. మేము ఈ విష‌యంపైనా చర్చించాము. చాలా యాక్షన్.. ఒక‌ రొమాంటిక్ పాటలా అనిపించింది'' అని సామ్ తెలిపారు. హ‌నీబ‌న్నీ సృష్టిక‌ర్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డ‌మే కాకుండా.. ఈ సిరీస్‌లోని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రిపేర‌వ్వ‌డం అంత సులువు కాద‌ని తెలిపింది.

నా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు శారీరకంగా చాలా ప్రిపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ లుక్ క‌నిపిస్తోంద‌నే అనుకుంటున్నాను. దీనిపై నేను చాలా గర్వంగా ఉన్నాను. అని స‌మంత అన్నారు. 'సిటాడెల్: హనీ బన్నీ' 7నవంబర్ 2024న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. సిటాడెల్ - హ‌నీ బ‌న్ని ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఒరిజిన‌ల్ లో న‌టించిన ప్రియాంక చోప్రా పాల్గొంది. స‌మంత ఈ స‌మావేశం కోసం సూప‌ర్ ఉమెన్ రేంజులో విచ్చేసింది.

Tags:    

Similar News