సమంతతో తుంబాడ్ డైరెక్టర్.. పోస్టర్ తోనే కిక్కిచ్చారు

తుంబాడ్ తో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Update: 2024-07-27 10:16 GMT

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వీరితోనే సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. కి వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిన ఇప్పటికి రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరు నిర్మాతలుగా తెరకెక్కబోయే వెబ్ సిరీస్ తో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుంబాడ్ తో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు.


బాలీవుడ్ లో తుంబాడ్ సినిమాని ఎవరు అంత ఈజీగా మర్చిపోరు. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన బెస్ట్ సినిమాలలో ఇది కూడా ఒకటి అని సినీ విశ్లేషకులు అంటుంటారు. అంతగా కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని రాహి అనీల్ బార్వే తెరకెక్కించారు. దర్శకులు సైతం ఈ చిత్రాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటూ ఉంటారు.

ఈ దర్శకుడే ఇప్పుడు సమంత లాంటి స్టార్ క్యాస్ట్ తో రక్త బ్రహ్మండ్ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నారు. అఫీషియల్ గా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిగా ఉంది. ఒక్కసారిగా ఈ వెబ్ సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అసలు ఎలాంటి కథాంశంతో దీనిని రాహి అనీల్ బార్వే చేయబోతున్నారు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వామిక గబ్బి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ చేస్తుందంట.

తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇందులో రక్తంతో నిండి ఉన్న ఒక కిరీటాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రక్త బ్రహ్మాండ్ టైటిల్ తో పాటు ది బ్లడీ కింగ్ డమ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీనిని బట్టి ఈ సినిమా గ్రే షెడ్స్ కాన్సెప్ట్ ఉండబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ పోస్టర్ తో సిరీస్ పైన కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని కన్ఫామ్ చేశారు. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ మొదలుపెట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. సమంత త్వరలో షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News