చైతన్య-శోభిత.. సామ్ ఏమాత్రం టచ్ చేసినా..

ఆమె సామాజిక మాధ్యమాల్లో ప్రతిస్పందిస్తారా లేదా, సైలెంట్‌గా ఉండాలనుకుంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Update: 2024-08-08 12:32 GMT

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట ఆగష్టు 8 న తమ నిశ్చితార్థాన్ని పూర్తిచేసుకున్నారు. నాగార్జున స్వయంగా ఈ శుభసమయంలో ఫోటోలు పంచుకొని, శోభితను తమ కుటుంబంలోకి స్వాగతించామని ప్రకటించారు. చైతన్య, శోభిత జంట సంప్రదాయ దుస్తుల్లో ఎంతో ఆనందంగా కనిపించారు.

అయితే, ఈ నిశ్చితార్థంపై చైతన్య మాజీ భార్య సమంత రూత్ ప్రభు ఎలా స్పందిస్తారనే చర్చ అంతటా మొదలైంది. సమంత, చైతన్య 2017 నుండి 2021 వరకు కలిసి ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట కలిసి పలు సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందింది. అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా కూడా క్రేజ్ అందుకునేవారు. అయితే, వారి విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వారు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు.

అయితే వారి వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా చైతన్య-శోభిత సంబంధం గురించి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచాయి. 2023 లో చైతన్య-శోభిత కలిసి వివిధ ప్రదేశాల్లో కనిపించడం స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారిగా వీరిపై మళ్ళీ ఫోకస్ పెరిగింది, వారి యూరోప్ వేకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంటపై పెళ్లి పుకార్లు అప్పటినుంచే మొదలైపోయాయి, కానీ ఈ ఏడాది ఆగష్టు 8న అధికారికంగా నిశ్చితార్థం జరగడంతో అన్ని పుకార్లకు తెరపడింది.

మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ నిశ్చితార్థం సమంత చైతన్యకు 2017 లో ప్రపోజ్ చేసిన తేదీకి దగ్గరగా జరిగింది. దీంతో ఈ స్పెషల్ డేట్ అభిమానులను మరోసారి చైతన్య-సమంత జంటను గుర్తుకు తెచ్చింది. ఈ సందర్భంలో సమంత ఎలా స్పందిస్తారనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత సోషల్ మీడియాను ఏ విధంగా టచ్ చేసినా కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంది.

అప్పుడప్పుడు ఆమె జీవితానికి సంబంధించిన కొటేషన్స్ తో ఆలోచింపజేస్తూ ఉంటుంది. దీంతో ఈసారి ఎలాంటి కొటేషన్ తో టచ్ చేస్తుందో అనేలా కామెంట్స్ వస్తున్నాయి. సమంత ఇప్పటివరకు ఈ నిశ్చితార్థంపై ఎటువంటి పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఆమె సామాజిక మాధ్యమాల్లో ప్రతిస్పందిస్తారా లేదా, సైలెంట్‌గా ఉండాలనుకుంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అయినప్పటికీ, ఈ సంఘటనపై ఆమె స్పందన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత గమనించడం లేదా సున్నితమైన కామెంట్ చేయడం ఎంతమాత్రం ఆశ్చర్యకరం కాదని, ఆమెను అనుసరించే అభిమానులు భావిస్తున్నారు. అలాగే, సమంత నిశ్చితార్థం మీద స్పందించే సమయం వస్తుందా లేదా అని కూడా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా, చైతన్య-శోభిత నిశ్చితార్థం వార్త తర్వాతి రోజుల్లో మరింత వైరల్ అవుతుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News