గట్టి కంటెంట్ తోనే సంబరాల ఏటి గట్టు..!

తొలి సినిమానే అయినా గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు డైరెక్టర్ రోహిత్.

Update: 2025-02-21 03:00 GMT

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా సంబరాల ఏటి గట్టు భారీ స్కేల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఫస్ట్ గ్లింప్స్ తో సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ముఖ్యంగా తేజ్ మేకోవర్ మాస్ లుక్ అదిరిపోయాయి. మెగా ఫ్యాన్స్ సాయి తేజ్ నుంచి కోరుకుంటున్న మాస్ మూవీ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. సాయి ధరం తేజ్ కూడా సంబరాల ఏటి గట్టుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. తొలి సినిమానే అయినా గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు డైరెక్టర్ రోహిత్.

సంబరాల ఏటి గట్టు కథ కామీషు ఏంటన్నది పక్కన పెడితే కచ్చితంగా ఆడియన్స్ కు ఒక మంచి మాస్ బొమ్మ చూపిస్తారని మాత్రం అర్థమవుతుంది. ఈ సినిమాలో తేజ్ పూర్తి మాస్ మేక్ అవర్ తో కనిపించనున్నాడు. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత తేజ్ ఎలాంటి సినిమా చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలాంటి సినిమానే సంబరాల ఏటి గట్టు అవుతుంది.

తేజ్ సినిమా సెట్స్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తే గట్టి కంటెంట్ తోనే సంబరాల ఏటి గట్టు సినిమా వస్తుందని అనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే సర్ ప్రైజ్ చేయగా నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో తేజ్ తన మాక్సిమం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయి తేజ్ చేస్తున్న ఈ మెగా మాస్ అటెంప్ట్ ఏ మేరకు ఆడియన్స్ కు రీచ్ అవుతుందో చూడాలి.

సాయి తేజ్ ఇప్పటివరకు కంప్లీట్ మాస్ సినిమా చేయలేదు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలన్నిటితో పోలిస్తే ఇది పూర్తిస్థాయిలో మాస్ టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా దసరా రిలీజ్ టార్గెట్ తో వస్తుందని టాక్. ఐతే ఇప్పటికే దసరా బరిలో బాలయ్య అఖండ 2 ని రిలీజ్ లాక్ చేశారు.

మెగా హీరోల సినిమాలు ఈమధ్య ఆశించిన ఫలితాన్ని అందుకోవట్లేదు. అందుకే ఇప్పుడు అందరు హిట్ టార్గెట్ తోనే సినిమాలు చేస్తున్నారు. అందులో తేజ్ మాత్రం సంబరాల ఏటి గట్టితో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఐతే తేజ్ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News