సంబరాల ఏటిగట్టు కార్నేజ్.. తెగిన నరాల్లోంచి అరుపు వినపడేలా..!
ఈ సినిమా తేజ్ కి కచ్చితంగా మాస్ ఇమేజ్ ని తెచ్చేలా ఉంది. ముఖ్యంగా గ్లింప్స్ వెనక ఉన్న కథను చెబుతూ వచ్చిన డైలాగ్స్ అదిరిపోయాయి.
మెగా మేనల్లుడు సాయి తేజ్ లేటెస్ట్ మూవీ గ్లింప్స్ రిలీజైంది. నూతన దర్శకుడు రోహిత్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబరాల ఏటిగట్టు టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రైం షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా కార్నేజ్ అంటూ రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే.. ఈ సినిమా తేజ్ కి కచ్చితంగా మాస్ ఇమేజ్ ని తెచ్చేలా ఉంది. ముఖ్యంగా గ్లింప్స్ వెనక ఉన్న కథను చెబుతూ వచ్చిన డైలాగ్స్ అదిరిపోయాయి.
సినిమాలో తేజ్ ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు. తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సంబరాల ఏటిగట్టు గ్లింప్స్ లో రోహిత్ టేకింగ్, అజనీష్ లోకనాథ్ బిజిఎం అదిరిపోయాయి. మెగా ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ అందించేందుకు సంబరాల ఏటిగట్టు వస్తుంది. వచ్చిన టీజర్ కి.. ఆ టైటిల్ కి సంబంధం లేదని అనిపిస్తున్నా సినిమా గ్లింప్స్ తోనే సూపర్ బజ్ క్రియేట్ చేశారు.
ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి.. తేజ్ పాత్ర ఎలా ఉండబోతుంది లాంటి విషయాలు త్వరలో తెలుస్తాయి. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ మాత్రం మాస్ అప్పీల్ తో అదిరిపోయింది. తేజ్ కూడా సినిమా కోసం బాగా కష్టపడినట్టు అనిపిస్తుంది. బ్రో సినిమా తర్వాత తేజ్ చేస్తున్న ఈ సినిమా టీజర్ తోనే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.
సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా అతనితో సినిమాలు చేసిన దర్శకులు కొందరు ఈ ఈవెంట్ కి వచ్చారు. తేజ్ కు సినిమా మీద ఉన్న ఇష్టాన్ని.. అతని టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. మరి తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా.. కొత్త దర్శకుడైనా నిర్మాతలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మరి దాని వెనక ఉన్న రీజన్ ఏంటి.. సినిమా ఎలా ఉండబోతుంది లాంటి విషయాలు త్వరలో తెలుస్తాయి. తేజ్ మాస్ అప్పీల్ మెగా ఫ్యాన్స్ కే కాదు కామన్ సినీ ప్రియులకు కూడా ట్రీట్ ఇచ్చేలా ఉంది. మరి ఈ సంబరాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తాయన్నది చూడాలి. ఈ సినిమాను తెలుగులోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.