జై చిరంజీవి.. జై చరణ్ బాబు.. చెవులకు హ్యాపీగా ఉంది..!
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నూతన దర్శకుడు రోహిత్ కెపి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు.
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నూతన దర్శకుడు రోహిత్ కెపి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. సంబరాల ఏటిగట్టు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్ లో తేజ్ తో పనిచేసిన దర్శకులంతా అటెండ్ అయ్యారు. తేజ్ 10 ఏళ్ల కెరీర్ గురించి వారితో పనిచేసిన అనుభవం గురించి వారు మాట్లాడారు. తేజ్ తో ప్రతిరోజూ పండగే లాంటి సినిమా తీసిన డైరెక్టర్ మారుతి ఎప్పటిలానే తన స్పీచ్ తో అలరించారు.
తేజ్ నా బ్రదర్ లాంటి వాడు.. నా కెరీర్ లో ప్రతిరోజూ పండగే లాంటి బెస్ట్ సినిమా ఇచ్చాడు. తేజూకి సినిమా మీద ఉన్న ప్రేమ అందరి దర్శకులకు తెలుసు. అతను పిలిచాడు అంటే అందరు కచ్చితంగా వస్తారు. సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. ఇక ఇందాక వచ్చిన చరణ్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా జై చిరంజీవి.. జై చరణ్ బాబు అంటుంటే చెవులకు హ్యాపీగా ఉంది. చాలా రోజులు అయ్యింది అది విని అని అన్నారు మారుతి. ఇంత గొప్ప సినిమా నిర్మించడానికి పూనుకున్న నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. తన ఫస్ట్ సినిమా పాతిక లక్షలతో తీశా.. మీ ఫస్ట్ సినిమా ఇంత బడ్జెట్ తో తీస్తున్నారు ఆల్ ది బెస్ట్ అంటూ దర్శకుడు రోహిత్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు మారుతి.
ఇదే ఈవెంట్ లో నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ క్లైమాక్స్ లో ఎక్కువ యాడ్స్ వేస్తే ఫ్యాన్స్ కొడతారు.. మా సుప్రీం హీరో మృత్యుంజయుడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సాయి దుర్గ తేజ్. ఫ్యామిలీలో అందరినీ కలుపుకునే వ్యక్తి తేజ్. ఆయన ఎప్పుడూ బాగుండాలి.. ఈ టీజర్ చూస్తుంటే ఒక్కటే మాట గుర్తొస్తుంది సీజ్ ద రికార్డ్స్ అని అన్నారు ఎస్.కె.ఎన్. ఇక ఇప్పుడే గ్లోబల్ స్టార్ రాం చరణ్ వెళ్లారు. సంక్రాంతి నుంచి గేం ఛేంజ్ అవుతుంది. ఆ సినిమా అన్ని రికార్డులు కొట్టాలని హృదయపూర్వకంగా కోరుతున్నా అన్నారు ఎస్.కె.ఎన్.
ఇదే ఈవెంట్ కి వచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడి కూడా తన ఎనర్జిటిక్ స్పీచ్ తో అలరించారు. తేజ్ ని ఉద్దేశిస్తూ అప్పుడే పదేళ్లు అయిపోయిందా అన్నారు. సో హ్యాపీ ఫర్ తేజూ.. నా కెరీర్ బిగినింగ్ లో సుప్రీం సినిమా చేశాం.. బాగా ఎంజాయ్ చేశాం.. ఇందాక చరణ్ గారు అన్నట్టు తేజూది బండ ప్రేమ కాదు కొండ ప్రేమ.. హార్ట్ ఫుల్ పర్సన్.. తేజు సూపర్ టాలెంటెడ్ యాక్టర్.. మంచి స్క్రిప్ట్ పడితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుతుంది. ఈ సినిమ గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఈ ఛేంజ్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అన్నారు అనీల్ రావిపుడి.