పుష్ప 2 బ్యాగ్రౌండ్ స్కోర్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా పైన దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Update: 2024-12-03 09:14 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా పైన దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని రికార్డ్ స్థాయిలో వ్యూవ్స్ ని సొంతం చేసుకున్నాయి. అలాగే సోషల్ మీడియాలో షార్ట్స్ గా వైరల్ అవుతున్నాయి.

అయితే ‘పుష్ప 2’ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కాకుండా మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి మ్యూజిక్ అందించినట్లు థమన్ క్లారిటీ ఇచ్చాడు. కొన్ని కీలక సన్నివేశాలకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లు ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేశాడు. ఇక సౌత్ ఇండియన్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ కూడా ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ స్కోర్ పైన వర్క్ చేశారు.

గతంలోనే దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సామ్ సిఎస్ ట్విట్టర్ లో నిర్మాతలు నవీన్, రవితో పాటు డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ని థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు. ‘పుష్ప 2’ లాంటి ప్రాజెక్ట్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం నన్ను కన్సిడర్ చేసినందుకు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

అలాగే మీతో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అల్లు అర్జున్ ని మెన్షన్ చేశారు. అలాగే సుకుమార్ గారి తో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలోని పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ సన్నివేశాలకి వర్క్ చేయడం భిన్నమైన అనుభూతి ఇచ్చింది. అలాగే ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నవీన్ నూలికి థాంక్స్ చెబుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

డిసెంబర్ 5న రాబోయే ఈ సినిమాని మీ దగ్గర్లో ఉన్న థియేటర్స్ కి వెళ్లి చూసి ఆస్వాదించండి అంటూ సామ్ సిఎస్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బట్టి మూవీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సుకుమార్ అతనిని ఉపయోగించుకున్నట్లు అర్ధమవుతోంది. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా అజనీష్ లోకనాథ్ కూడా ఈ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ పైన వర్క్ చేశారని తెలుస్తోంది. మరి ఈ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో సుకుమార్ ‘పుష్ప 2’ కోసం ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News