అలాగైతేగానీ సంప‌త్ నందికి ఛాన్స్ రాలేదే!

మాస్ డైరెక్ట‌ర్ గా పేరు గాంచిన సంపత్ నంది నిన్న‌టి రోజున యంగ్ హీరో శ‌ర్వానంద్ తో కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-20 20:30 GMT

మాస్ డైరెక్ట‌ర్ గా పేరు గాంచిన సంపత్ నంది నిన్న‌టి రోజున యంగ్ హీరో శ‌ర్వానంద్ తో కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్వాకిది 38వ చిత్రంగా మొద‌లైంది. శ్రీ స‌త్య‌సాయి ఆర్స్ట్ ప‌తాకంపై రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. అయితే ఈ ఛాన్స్ కోసం సంపత్ నంది పెద్ద ఎత్తునే క‌స‌ర‌త్తులు చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. సంపత్ నంది ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి మూడేళ్లు అవుతుంది.

`సిటీమార్` త‌ర్వాత ఆయ‌న సినిమాలు డైరెక్ట్ చేయ‌లేదు. ఈ గ్యాప్ లో రైట‌ర్ గా కొన్ని సినిమాల‌కు ప‌నిచే సారు. మ‌రి ద‌ర్శ‌కుడిగా చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి? అంటే ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన మార్పులుగానే క‌నిపిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ సంత‌ప్ నంది చేసిన సినిమాల‌న్నీ ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు. నాలుగు ఫైట్లు..పాట‌ల‌తో ..ఎంట‌ర్ టైనింగ్ చెప్పిన స్టోరీలే. కానీ ఇప్పుడు జ‌మానా అలాంటి స్టోరీలు న‌డ‌వ‌వు.

ఇప్పుడంతా యూనిక్ స్టోరీల‌కు పెద్ద పీట వేస్తున్నారు. హీరోల నుంచి నిర్మాత‌ల వ‌ర‌కూ పాయింట్ యూనిక్ గా ఉందా? లేదా? అది పాన్ ఇండియాకి క‌నెక్ట్ అవుతుందా? లేదా? అని ఆలోచించి చూజ్ చేసుకుంటున్నారు. అలాంటి వారికే అవ‌కాశాలివ్వ‌డానికి ముందుకొస్తున్నారు. అలా చూసుకుంటే సంప‌త్ నంది వెనుక‌బ‌డే ఉన్నాడు. అందుకే శ‌ర్వాతో సినిమా చేయ‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింది.

ఈ మూడేళ్ల పాటు కొత్త సినిమా స్టోరీపై పెద్ద యుద్ద‌మే చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. అత‌డు ఎంపిక చేసుకున్న పాయింట్ లో నే క‌ష్టం క‌నిపిస్తుంది. శ‌ర్వాతో తెర‌కెక్కించే ఈ సినిమా 1960 బ్యాక్ డ్రాప్ లో న‌డుస్తుంది. తెలంగాణ‌-మ‌హరాష్ట్ర మ‌ధ్య జరిగే ఓ పీరియాడిక్ స్టోరీ. సంప‌త్ నంది ఇంత వ‌ర‌కూ ఇలాంటి బ్యాక్ డ్రాప్ గానీ...స్టోరీగానీ రాసింది లేదు. శ‌ర్వానంద్ కూడా ఇలాంటి సినిమాలు చేసింది లేదు. 60వ ద‌శ‌కం నాటి పాత్ర‌లో శ‌ర్వా క‌నిపించ‌నున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో 70-80-90 ద‌శ‌కం బ్యాక్ డ్రాప్ సినిమాలు మంచి ఫ‌లితాలు సాధిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News