ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కెప్టెన్ కుర్చీ!
కమర్శియల్ డైరెక్టర్ గా సంపత్ నందికి ఒకప్పుడు మంచి పేరుండేది. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో అతడికంటూ ఓ శైలి క్రియేట్ చేసుకుని కొన్నాళ్ల పాటు తిరుగు లేకుండా ముందుకు సాగాడు.;
కమర్శియల్ డైరెక్టర్ గా సంపత్ నందికి ఒకప్పుడు మంచి పేరుండేది. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో అతడికంటూ ఓ శైలి క్రియేట్ చేసుకుని కొన్నాళ్ల పాటు తిరుగు లేకుండా ముందుకు సాగాడు. అయితే కాలంతో పాటు అతడి కథలు కూడా ఔడెటెట్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. కథల విషయంలో టాలీవుడ్ ట్రెండ్ మార్చి ముందుకెళ్లింది. కాన్సెప్ట్ చిత్రాలకు...కథా బలం ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేయడంతో? సంపత్ కి కొత్త అవకాశాలు తగ్గాయి.
దీంతో సంపత్ దర్శకత్వాన్ని పక్కనబెట్టి నిర్మాతగా బిజీ అయ్యాడు. అలా నాలుగేళ్లగా నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. అలాగని దర్శకత్వం ప్రయత్నాలు ఆపలేదు. ఓవైపు ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ హీరోలు బిజీగా ఉండటం...కొంత మందికి స్టోరీలు సెట్ కాకపోవడంతో డిలే అవుతుంది. అయితే ఎట్టకేలకు మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. యంగ్ హీరో శర్వానంద్ కి ఆ మధ్య స్టోరీ నేరెట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆయన కూడా పాజిటివ్ గానే స్పందించాడు. ఇప్పుడా ప్రాజెక్ట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని సమాచారం. కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్లు సిద్దం చేస్తున్నారు. ఇందులో శర్వాకి జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి ఎంపికయ్యారు. ఇప్పటికే అనుపమ శర్వాకి జోడీగా ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ గా ఈ సినిమా విజయం సంపత్ కి చాలా కీలకం. నాలుగేళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఇది. హిట్ అయితేనే మరో ఛాన్స్. లేదంటే ఉన్న కాంపిటీషన్ మారిన ట్రెండ్ లో సంపత్ కొత్త అవకాశాలు అందు కోవడం మరింత జఠిలమవుతుంది. మరి ఈ చిత్రాన్ని ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడో చూడాలి.