బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో సంయుక్త: గ్లామర్, గ్రేస్‌కి న్యూ డెఫినిషన్!

సాంప్రదాయ లుక్‌లో మాత్రమే కాకుండా, మోడ్రన్ స్టైల్స్‌లో కూడా సంయుక్త చాలా స్టన్నింగ్‌గా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Update: 2024-10-05 10:30 GMT

సౌత్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న నటి సంయుక్త మీనన్, ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బ్లాక్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో, స్టన్నింగ్ లుక్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానుల మనసును దోచుకుంటున్నాయి.

 

సమకాలీన ఫ్యాషన్‌కి సరికొత్త నిర్వచనం ఇస్తూ సంయుక్త ఈ సారి కూడా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించింది. ఆమె ధరించిన బ్లాక్ టాప్, స్కర్ట్ లుక్ హుందాగా, క్లాసీగా కనిపిస్తుంది. ఈ ఫోటో షూట్‌లో ఫ్యాషన్ స్టైలిస్ట్ శ్రుతి మంజరి ఆధ్వర్యంలో ఈ లుక్ డిజైన్ చేయబడింది. ఆమె వేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో సంయుక్త మోడ్రన్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది.

 

అంతేకాకుండా, ఫోటోగ్రాఫర్ ఇషాన్ నిఖిల్ గిరి ఈ ఫోటోలను తన ప్రత్యేకమైన టెక్నిక్‌తో అందంగా క్యాప్చర్ చేశారు. ఫోటోలో బ్లాక్ కలర్‌ మోడ్రన్ టాప్, స్టైలిష్ స్కర్ట్‌తో పాటు మెరిసే బ్రేస్లెట్, సింపుల్ బ్లాక్ బ్లేజర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ కనిపిస్తుంది సంయుక్త.

 

ఈ ఫోటోలు పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు, అభిమానులు సంయుక్తకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాంప్రదాయ లుక్‌లో మాత్రమే కాకుండా, మోడ్రన్ స్టైల్స్‌లో కూడా సంయుక్త చాలా స్టన్నింగ్‌గా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

ఇక కెరీర్ పరంగా చూసుకుంటే, సంయుక్త ప్రస్తుతం పలు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్ సరసన 'స్వయంభూ' చిత్రంలో నటిస్తుండగా, మలయాళంలో మోహన్‌లాల్ సరసన 'రామ్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, బాలీవుడ్‌లో ‘మహారాగ్ని’ సినిమాతో కూడా సంయుక్త ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.

Tags:    

Similar News