పింక్ శారీలో సంయుక్త.. ఆహా ఏమి అందం!

భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్ సినిమాలు చేసింది సంయుక్త

Update: 2024-07-15 04:20 GMT

హీరోయిన్ సంయుక్త మీనన్ కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ బ్యూటీ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భీమ్లా నాయక్ మూవీలో సంయుక్త తన అందం, అభినయంతో సినీ ప్రియులను తెగ మెప్పించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సంయుక్త.. గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అమ్మడు.

భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్ సినిమాలు చేసింది సంయుక్త. వాటిలో డెవిల్ మినహా మిగతా మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. దీంతో బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నిఖిల్ స్వయంభులో నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీతో పాటు మాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతోంది బ్యూటీ.

ఇటీవల బాలీవుడ్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది. స్పై ఫేమ్ చరణ్ తేజ్ ఉప్పాలపాటి దర్శకత్వం వహిస్తున్న మహారాగ్ని మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది సంయుక్త మీనన్. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గ్లింప్స్ లో కనిపించి ఆకట్టుకుంది. కారు రేసింగ్ లో గ్లామరస్ డ్రెస్‍ తో ఎంట్రీ ఇచ్చి ఫిదా చేసింది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తుంటోంది. తన ఫ్యాన్స్ కోసం డైలీ అప్డేట్స్ ఇస్తుంటోంది.

చీరలతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తూ అలరిస్తుంటోంది. ఒక్కో ఔట్ ఫిట్ లో వేరే లెవెల్ పోజులిస్తుంటోంది. క్లాసీగా, డీసెంట్ గా తరచుగా గ్లామర్ షో చేస్తుంటోంది. అలా తన ఫాలోవర్స్ ను భారీగా పెంచుకుంటోంది. తాజాగా అదిరిపోయే పిక్స్ ను షేర్ చేసింది. పింక్ కలర్ ప్లెయిన్ శారీలో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకున్న అమ్మడు.. క్రేజీ నెక్ సెట్ ను ధరించింది. స్టన్నింగ్ గా కనిపిస్తోంది.

చీర పైటను కాస్త పక్కకు వేసుకుని ఎద అందాలతో కవ్విస్తోంది అమ్మడు. క్లాసీగా కనిపిస్తూనే సెగలు రేపుతోంది. నడుము మడతలు కనిపించేలా స్టిల్స్ ఇస్తూ హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుతం సంయుక్తకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫైర్ ఇమోజీలను కామెంట్స్ గా పెడుతున్నారు నెటిజన్లు. సో బ్యూటిఫుల్ అంటూ కొనియాడుతున్నారు. సంయుక్త గ్లామర్ కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. మరి అమ్మడు అందాలను చూశారా?

Tags:    

Similar News