నేనైతే అప్పటికప్పుడే కడిగేస్తా!
జస్టిస్ హేమ కమిటీ నివేదిక తో మాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక తో మాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. దేశ వ్యాప్తంగా నివేదికపై చర్చ జరుగుతోంది. మాలీవుడ్ నటీనటులపై తీవ్రమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. బాధిత మహిళల పట్ల ఎవరి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అదే పరిశ్రమకు చెందిన సంయుక్తా మీనన్ ముందుకు ఇలాంటి ప్రశ్న వెళ్లింది. ఇండస్ట్రీలో మీరు కాస్టింక్ కౌచ్ పరిస్థితులు ఎదుర్కున్నారా? అంటే.. ` `అలాంటిదేం లేదు.
ఈ విషయంలో నేను లక్కీ. సినిమా మేకింగ్ ప్రోసస్ అర్దం కాక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా. ఒకవేళ కాస్టింగ్ కౌచ్ లాంటి చేదు అనుభవం ఎదురై ఉంటే? అప్పటికప్పుడు ముఖం మీదనే అడిగేస్తా. నేను ముక్కు సూటి మనిషిని. అలాంటి విషయాలు అస్సలు సహించను. ఇంట్లో ఏడ్చేసి ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చే టైపు కాదు. మలయాళంలో నా తొలి సినిమా నుంచి టాలీవుడ్ వరకూ నా ప్రయాణం అంతా సాఫీగానే సాగింది.
నేను పని చేసిన ప్రొడక్షన్ హౌస్ లు అన్నీ మంచివే` అని తెలిపింది. లైంగిక వేధింపులు ఎదుర్కున్న వారు ఆనాడు నోరు విప్పకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని చాలా మంది ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ఎవరికి వారు తమ కారణాలు చెప్పుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. బయటకు చెప్పుకునే విషయాలు కాకపోవడంతోనే చాలా మంది మౌనంగా ఉన్నట్లు... ధైర్యంగా ముందుకు రాలేకపోవడం కూడా మరో కారణంగా చెప్పుకొచ్చారు.
సీనియర్ నటి ఖుష్బూ సైతం చిన్న వయసులో ఇలాంటి వేధింపులు ఎదుర్కున్న బాధితురాలినేని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా పేరున్న చాలా మంది నటీమణులు తమ అనుభవాలు చెప్పుకొచ్చారు. మెజార్టీ వర్గం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులున్నాయనే అభిప్రాయపడ్డారు.