శర్వా 37: సమ్యూక్తా ‘దియా’ అవతారం
టాలీవుడ్‌లో స్టార్ హీరో శర్వానంద్ 37వ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది.
టాలీవుడ్‌లో స్టార్ హీరో శర్వానంద్ 37వ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణం చేస్తున్న ఈ చిత్రం ఒక సరికొత్త స్టోరీ లైన్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సమజవరగమన’ లాంటి హాస్యప్రధానమైన చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ అబ్బరాజు, ఈ సినిమా ద్వారా మరొక ఫన్ రైడ్‌కు సిద్ధమవుతున్నాడు.
ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్త ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంయుక్త పుట్టిన రోజు సందర్భంగా, ఆమె పాత్రకు సంబంధించి ‘దియా’ అనే పాత్ర పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సంయుక్త సంప్రదాయ నృత్య దుస్తుల్లో, రెండు దీపాలతో తన అద్భుతమైన నర్తన శైలిని చూపిస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఆమె చేతిలో ఉన్న దీపాల కాంతిలో ఆమె అందం మరింత వెలుగుతుండటంతో, ఆమెకు చెందిన పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో భాగమైన సాంకేతిక నిపుణుల బృందం కూడా విశేషమైనది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాణా డైలాగ్స్ రాశారు.
బ్రహ్మా కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక, నిర్మాతల విషయానికి వస్తే అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఈ చిత్రం కేవలం కామెడీ తో మాత్రమే కాకుండా శర్వానంద్ కేరెక్టర్‌లో ఒక న్యూ డిఫరెంట్ మూవీ అని మేకర్స్ చెబుతున్నారు. శర్వానంద్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాలోని ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక, సంయుక్త ‘దియా’ పాత్రతో ఈ సినిమాలో అందమైన స్థానం సంపాదించుకోనుందని అనిపిస్తోంది. ఇండస్ట్రీలో సంయుక్త జెట్ స్పీడ్ లో క్రేజ్ అందుకుంది. విరుపాక్ష సక్సెస్ అనంతరం ఆమెకు అవకాశాలు మరింత పెరిగాయి. ఇక ప్రస్తుతం శర్వా సినిమాతో పాటు హిందీ, మలయాళంలో కూడా సినిమాలు చేస్తోంది. నిఖిల్ తో చేస్తున్న స్వయంభూ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.