యువ హీరోకి మ్యాటర్ లేదంట... వైరల్ వీడియో

రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ఈ వీడియోని రిలీజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Update: 2024-08-19 08:45 GMT

సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో సంయుక్త అనే అమ్మాయి ఒక యువ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఆ హీరోకి మ్యాటర్ లేదంటూ స్కార్ఫ్ ముఖానికి కట్టుకొని ఉన్న అమ్మాయి వీడియో మొదలు పెట్టింది. ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అనేది ఓ సారి చూసుకుంటే ఇలా ఉంది.

గత నెల రోజుల నుంచి ఓ హీరో గురించి మనం వింటున్నాం కదండి. నిజం చెప్పాలంటే అతనికి అసలు మ్యాటర్ లేదంట. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక ఏడాదిగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అతనితో రిలేషన్ లో ఉందండి. వారిద్దరూ కలిసి ఉండటం ఏమో కానీ, ఆ పిల్ల ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తూనే ఉండేది. ఎలా అంటే.. ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారంట... కానీ ఇతను మాత్రం పక్కకు తిరిగి నిద్రపోతాడంటా. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లిన అతను మాత్రం దూరంగా వెళ్ళిపోతాడంట.

అదేదో ఒక ఆడియో కాల్ లో విన్నానండి. ఆ అమ్మాయి వాడ్ని తీసుకుని రా, వీడిని తీసుకొని రా అంటుంది. ఈ మనిషి పక్కనే ఉన్న కూడా అలా ఉంటుంది అంటే అర్థం చేసుకోవాలి కదండి. 27 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటానన్నాడు ఇప్పుడు 30 వచ్చాయి. మరో 10 ఏళ్ళు అయిన పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏం లేదు. సినిమాలు మాత్రం బానే చేసుకుంటాడు. భలే ఉన్నాడే, గిలే ఉన్నాడే అని. అంటే మనిషి చూడటానికి బాగానే ఉంటాడు. కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో. బయట జీరో. ఏదేమైనా సరే ఆగస్టు 19న నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తుంది.

ఆ రోజు విత్ ప్రూఫ్స్ తో మీకు అన్ని చూపించి మాట్లాడుతాను అంటూ వీడియోలో సంయుక్త పేర్కొంది. రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ఈ వీడియోని రిలీజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భలే ఉన్నాడే సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమా టీజర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అమ్మాయిలకి చీరలు కట్టే ఫ్యాషన్ డిజైనర్ క్యారెక్టర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Full View
Tags:    

Similar News