యానిమల్ ఫ్రాంచైజ్ లో గ్లోబల్ స్టార్..?

అదేంటి అంటే సందీప్ వంగ తన సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ ప్రాజెక్ట్ చేర్చుకున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.;

Update: 2025-04-15 17:54 GMT
యానిమల్ ఫ్రాంచైజ్ లో గ్లోబల్ స్టార్..?

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో డైరెక్టర్ గా తన మార్క్ సెట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాను తెలుగులో సూపర్ హిట్ చేసుకుని అదే సినిమా కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు సందీప్ వంగ. ఐతే ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమా మరో సెన్సేషనల్ అయ్యింది. ఆ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ఏర్పడినా అవి సినిమా సక్సెస్ కు హెల్ప్ అయ్యాయే తప్ప అంత ఎఫెక్ట్ చూపించలేదు. ఈ క్రమంలో యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ కూడా సందీప్ వంగ అనౌన్స్ చేశాడు.

ఐతే యానిమల్ పార్క్ కన్నా ముందు సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ ఫౌజీకి కొన గ్యాప్ ఇస్తే స్పిరిట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్. ఐతే ఆ సినిమా తర్వాత అసలైతే అల్లు అర్జున్ తో ఒక సినిమా, విజయ్ దేవరకొండ తో మరో సినిమా ప్లాన్ చేశాడు సందీప్. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటికి పూర్తి చేస్తాడన్నది క్లారిటీ లేదు.

ఆ నెక్స్ట్ యానిమల్ పార్క్, అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇదిలాఉంటే ఫిల్మ్ నగర్ లో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటి అంటే సందీప్ వంగ తన సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ ప్రాజెక్ట్ చేర్చుకున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్న చరణ్ నెక్స్ట్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేశారు. ఐతే ఆర్సీ 17వ సినిమాగా సుకుమార్ ప్లేస్ లో సందీప్ వంగ వచ్చి చేరాడని లేటెస్ట్ టాక్.

సందీప్ వంగ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్, అల్లు అర్జున్ సినిమా రెండు చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ సినిమా బదులుగా చరణ్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. నేషనల్ వైడ్ గా సందీప్ వంగ రేంజ్ ఏంటో తెలిసింది కాబట్టే చరణ్ అతనితో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఐతే స్పిరిట్ పూర్తి చేశాక ముందు యానిమల్ పార్క్ చేస్తాడా లేదా చరణ్ సినిమా చేస్తాడా అన్నది క్లారిటీ రావాలి.

ఈలోగా సుకుమార్ కూడా చరణ్ సినిమా హోల్డ్ లో పడితే నెక్స్ట్ పుష్ప 3 పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరితో చేస్తాడన్నది చూడాలి. మొత్తానికి రామ్ చరణ్ సినిమాల లైనప్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. మరి ఈ సినిమాలన్నీ వర్క్ అవుట్ అయితే చరణ్ గ్లోబల్ రేంజ్ లో సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.

Tags:    

Similar News