మీకోసం ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం..!

పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు, నటించబోతున్న సినిమాలన్నీ వెయ్యి కోట్ల సినిమాలు అనడంలో సందేహం లేదు

Update: 2025-02-13 05:29 GMT

పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు, నటించబోతున్న సినిమాలన్నీ వెయ్యి కోట్ల సినిమాలు అనడంలో సందేహం లేదు. అలాంటి హీరో సినిమాలో ఒక్క నిమిషం కనిపించినా చాలు అని టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌కి చెందిన ఎంతో మంది నటీనటులు అనుకుంటారు. ఆయన పక్కన ఒక్క సినిమాలో నటించినా చాలా పెద్ద విషయం అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు. అలాంటి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం మీకు దక్కవచ్చు. ఔను... ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందబోతున్న స్పిరిట్‌ సినిమాలో కీలక పాత్రల కోసం కాస్టింగ్‌ కాల్‌కి నిర్మాణ సంస్థ అధికారికంగా పిలుపునిచ్చింది.

ఈమధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల కోసం కాస్టింగ్‌ కాల్‌ నడుస్తూ ఉంది. కథ అనుసారం కొత్త నటీ నటులు అవసరం అని, అందుకే ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేయబోతున్నట్ల మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. స్పిరిట్‌ సినిమాలో నటించాలి అనే ఆసక్తి ఉన్న వారు వీడియోలు, ఫోటోలు పంపించండి అంటూ మెయిల్‌ ఐడీని షేర్‌ చేశారు. ప్రభాస్‌ తో కలిసి నటించే అవకాశం అంటే ఊరుకే ఉంటారు. లక్షలాది మంది స్పిరిట్‌ సినిమా కాస్టింగ్‌ కాల్‌కి స్పందించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సందీప్ రెడ్డికి నటీనటులను ఎంపిక చేసుకోవడం చాలా కష్టం కావచ్చు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. రికార్డ్‌ బ్రేకింగ్‌ బడ్జెట్‌తో ఈ సినిమాను దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ రూపొందించబోతున్నాడు. యానిమల్‌ సినిమా తర్వాత సందీప్ వంగ రూపొందిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అందుకే ఈ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్‌ను సందీప్‌ వంగ దక్కించుకోవడం కన్ఫర్మ్‌. ప్రభాస్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో స్పిరిట్‌ వెయ్యి కోట్ల సినిమా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యానిమల్‌ తర్వాత సందీప్ వంగ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌లో కాకుండా పాన్ వరల్డ్‌ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగ సినిమాను ప్రకటించిన సమయంలోనే తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడం, మలయాళం భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్‌కి ఉన్న స్టామినా నేపథ్యంలో సందీప్‌ వంగ కాస్త శ్రద్ద పెడితే కచ్చితంగా రూ.2000 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సలార్‌, కల్కి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలు రాబోతున్నాయి. వచ్చే ఏడాదిలో స్పిరిట్‌ సినిమా రానుంది. ఇంతటి క్రేజీ సినిమాలో నటించే అవకాశం మీకే రావచ్చు... కనుక ఆసక్తి ఉంటే వెంటనే మీ ఫోటోలు, వీడియోలను spirit.bhadrakalipictures@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించేయండి.

Tags:    

Similar News