స్పిరిట్ ఇదే ఏడాది..కానీ రిలీజ్ మాత్రం అప్పుడే!
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ వంగ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' ప్రకనటొచ్చి చాలా కాలమవుతోంది.
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ వంగ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' ప్రకటనొచ్చి చాలా కాలమవుతోంది. కానీ ఇంతవరకూ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇటీవలే హను రాఘవపూడి చిత్రాన్ని సైతం డార్లింగ్ పట్టాలెక్కించాడు. వాస్తవానికి డార్లింగ్ దర్శకుల లిస్ట్ లో రాఘవపూడి లేనే లేడు. కానీ స్టోరీ నచ్చడంతో? ప్రభాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసాడు.
దీంతో ఈ ప్రాజెక్ట్ తో పాటు డార్లింగ్, మారుతి 'రాజాసాబ్' ని కూడా ఏకకాలంలో ముగించాలి. రెండు సినిమాలకు డేట్లు ప్లాన్ డ్ గా సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో సందీప్ రెడ్డితో చేయాల్సిన స్పిరిట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమనుకున్నారంతా? అది వచ్చే ఏడాదే జరుగుతుందని అంతా గెస్ చేస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం ఇదే ఏడాది తన సినిమా మొదలవుతుందని తాజాగా ప్రకటించాడు.
ప్రత్యేకంగా నెల తేదీ అంటూ చెప్పలేదు గానీ త్వరలోనే 'స్పిరిట్' కూడా మొదలవుతుందన్నాడు. కానీ రిలీజ్ మాత్రం రెండేళ్లు సమయం పడుడుతుందంటున్నాడు. అంటే సినిమా ఇప్పుడు మొదుల పెడితే 2026 లోనే 'స్పిరిట్ 'రిలీజ్ అవుతుంది. అంతవరకూ ప్రేక్షకాభిమానులు తన సినిమా గురించి ఎదురు చూడొద్దని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేయడం అన్నమాట. ఇది మంచిదే. లేదంటే అనవసరంగా నెట్టింట ట్రోలింగ్ బారిన పడాల్సి ఉంటుంది.
స్పిరిట్ ని మొదలు పెట్టి మెల్లగా షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అంటే షూటింగ్ కోసమే రెండేళ్లు సమయం కేటాయించినట్లు. సందీప్ వంగ షూటింగ్ కోసం ఎక్కువగానే సమయం తీసుకుంటాడు. తొలి సినిమా 'అర్జున్ రెడ్డి', అటుపై' కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలకు బాగానే సమయం తీసుకున్నాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని డీల్ చేయాలంటే? మరింత సమయం తప్పనిసరిగా భావించినట్లు తెలుస్తోంది.