డైరెక్షన్ ఓకే.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా...
రెండే రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యారు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
రెండే రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యారు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీలతో ఓ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇటీవల యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఎలాంటి సంచలనం సృష్టించారో అందరికీ తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ సింగ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకుపైగా రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు కొల్లగొట్టింది. మేకర్స్ కు రూ. కోట్లలో లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా విషయంలో అనేక విమర్శలు వచ్చినా.. తగ్గేదేలే అంటూ దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చి రికార్డులు తిరగరాసింది.
ఇక సందీప్ నెక్స్ట్ సినిమాలపై అందరి దృష్టి పడింది. ఆయన లైనప్ మామూలుగా లేదు. స్టార్ హీరోలతో వర్క్ చేయనున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీయనున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మూవీ లవర్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయనున్నారు.
అయితే సందీప్.. ఇప్పుడు తెలుగు చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అందుకు గాను హైదరాబాద్ లో ఓ ఆఫీస్ కూడా ఇటీవల స్టార్ట్ చేశారట. స్క్రిప్టులను పరిశీలించడానికి ఓ స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారట. సందీప్ రెడ్డి వంగా ఫైనల్ చేశాకే.. ఆ స్క్రిప్ట్ ఓకే అవుతుందట. టాలీవుడ్ కు అనేక మంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారట.
ఇప్పటి వరకు ఇంకా ఒక్క స్క్రిప్ట్ కూడా సందీప్ రెడ్డి వంగా ఓకే చేయలేదట. కానీ 2024 ముగిసేలోపు రెండు తెలుగు సినిమాలు ప్రకటించాలని ఫిక్స్ అయ్యారట. అందుకు తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సందీప్ స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. అయితే అక్టోబర్ లో షూటింగ్ మొదలవుతుందనుకున్నా.. కొద్ది రోజులు లేట్ అవ్వొచ్చని తెలుస్తోంది. మరి సందీప్ నిర్మాతగా తొలి మూవీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.