సందీప్ వంగా.. 2 వేల కోట్లా?

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

Update: 2024-03-03 04:22 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశం మొత్తం సందీప్ రెడ్డి గురించి మాట్లాడుతుంది. ఫెమినిస్ట్ లు అంటూ హడావిడి చేసే అందరూ సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి చర్చిస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా 900 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.

రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని యానిమల్ మూవీ అందించింది. అలాగే నటుడిగా కూడా రణబీర్ కపూర్ లో వేరియేషన్స్ ని యానిమల్ ఆవిష్కరించింది. ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ కూడా సందీప్ రెడ్డి ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. హీరోయిజం లో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ని చూపించడం సందీప్ ప్రత్యేకత. హీరోకి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ని అతను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు.

ఈ క్యారెక్టరైజేషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ కారణంగానే సందీప్ సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా 50 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దీనికి రీమేక్ గా హిందీలో చేసిన కబీర్ సింగ్ ఏకంగా 350 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. యానిమల్ సినిమాకి 900 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. అతని సినిమాల కలెక్షన్స్ రికార్డ్ చూసుకుంటే 3 టూ 5 టైమ్స్ ఎక్కువ వసూళ్లని సాధిస్తూ వచ్చాయి.

ఇదే రికార్డ్ కొనసాగితే ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీ కచ్చితంగా 2 వేల కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. స్పిరిట్ మూవీలో ప్రభాస్ మొదటిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇమాజినేషన్ చేసుకుంటే ప్రభాస్ కటౌట్ పోలీస్ యూనిఫామ్ లో బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే కచ్చితంగా అది నెక్స్ట్ లో ఉంటుందని చెప్పొచ్చు.

హైపర్ ఎమోషన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటే యాక్షన్ సీక్వెన్స్ కూడా హై ఎండ్ లోనే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కరెక్ట్ గా స్టోరీ, అలాగే ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయే యాక్షన్ అండ్ ఎమోషన్ ఎలిమెంట్స్ సెట్ అయితే స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగా కలెక్షన్స్ ట్రాక్ రికార్డ్ ని కూడా నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News