సంగీత్ శోభన్ అల్లరి నరేష్ లా
ఈవీవీ వారసుల్లో అల్లరి నరేష్ కంటే? ఆర్యన్ రాజేష్ పెద్ద స్టార్ అవుతాడనుకున్నారంతా.;

ఈవీవీ వారసుల్లో అల్లరి నరేష్ కంటే? ఆర్యన్ రాజేష్ పెద్ద స్టార్ అవుతాడనుకున్నారంతా. కానీ అందుకు రివర్స్ లో జరిగింది. రాజేష్ కంటే నరేష్ పెద్ద స్టార్ అయ్యాడు. ప్రధాన పాత్రల్లో కమెడియన్ గా నటించి తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. దీంతో నరేష్ కెరీర్ కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూడ కుండా సాగిపోయింది. నరేష్ కామెడీ రొటీన్ గా మారడంతో? విజయాలు తగ్గాయి.
దీంతో నరేష్ కూడా పాత్రల ఎంపికల తీరు మారింది. కొత్త తరహా పాత్రలవైపు వెళ్లడం మొదలు పెట్టాడు. లక్కీగా అక్కడా కలసొచ్చింది. ఈ క్రమంలో యాక్షన్ కంటెంట్ వైపు కూడా కదులుతున్నాడు. కానీ ఇక్కడ ఇంకా సరైన బ్రేక్ రాలేదు. అలాగని నరేష్ కామెడీ పాత్రలకు చేయనని ప్రకటనా చేయలేదు. అవకాశం వస్తే వాటిలోనూ నటిస్తానంటున్నాడు. కానీ కామెడీలో ట్రెండ్ మారింది.
నవతరం నటులు కొత్త తరహా ఫిక్షన్ కామెడీ ట్రై చేయడం వర్కౌట్ అవుతుంది. ఇందులో `మ్యాడ్` సినిమాతో వెలుగులోకి వచ్చిన సంగీత్ శోభన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఇటీవలే `మ్యాడ్ స్క్వేర్` తోనూ మరో హిట్ అందుకున్నాడు. ఇలా వరుస రెండు విజయాలు సంగీత్ ని సోలో హీరోగా ప్రమోట్ చేసాయి. మెగా వారసురాలు నిహారిక సంగీత్ తో ఓ సినిమా కూడా నిర్మిస్తుంది.
ఇది గాక కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ ని బేస్ చేసుకుని రాసుకు న్న కథలే ఇవన్నీ. దీంతో నరేష్ ప్లేస్ ని సంగీత్ శోభన్ రీప్లేస్ చేసినట్లు కనిపిస్తుంది. కొంత కాలం పాటు సంగీత్ కామెడీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అది ఎంతలా అంటే రవితేజ మాస్ కామెడీ, నరేష్ కామెడీ వర్కౌట్ అయినంతగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది తాత్కాలికం మాత్రమే.
కామెడీ తాజా ట్రెండ్ మారనంత వరకూ సంగీత్ శోభన్ సినిమాలు చేసుకువచ్చు. సంగీత్ కి సంతోశ్ శోభన్ అనే అన్నయ్య కూడా ఉన్న సంగతి తె లిసిందే. అతడు హీరోనే. ఆరంభంలో సక్సెస్ చూసి తాను పెద్ద స్టార్ అవుతాడ నుకున్నారంతా. కానీ రేసులో వెనుకబడ్డాడు. ప్రస్తుతానికి సంగీత్ శోభన్ హవా కనిపిస్తుంది. ఈ అన్నదమ్ముల కథ కూడా అల్లరి-అర్యన్ స్టోరీల్లా మారుతుందా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.