రెండవ పెళ్లికి సానియా మీర్జా సై అనేసిందా!
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోయిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల బంధానికి ఇద్దరు పుల్ స్టాప్ పెట్టి ఎవరి స్వేచ్ఛ వారు కోరుకున్నారు.
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోయిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల బంధానికి ఇద్దరు పుల్ స్టాప్ పెట్టి ఎవరి స్వేచ్ఛ వారు కోరుకున్నారు. అయితే షోయబ్ మాత్రం విడిపోయిన వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ సానియా మీర్జా మాత్రం ఇంతవరకూ రెండవ వివాహం చేసుకోలేదు. కుమారుడితోనే కలిసి జీవిస్తుంది. పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో మంది సలహా ఇస్తున్నప్పటికీ ఆ ఛాన్స్ తీసుకోలేదు.
సరిగ్గా ఇదే సమయంలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం కూడా సాగింది. షమీ కూడా అప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. దీంతో సానియా వివాహం షమీతో ఖాయమనుకున్నారు. కానీ ఆ ప్రచారాన్ని సానియా తండ్రి ఖండించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. అటుపై సానియా మీర్జా ఒంటరిగా ఉండకూడదని రెండవ పెళ్లి చేసుకోవాలని పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ కూడా అభిప్రాయపడ్డాడు.
కానీ సానియా మాత్రం పెళ్లి అంటే విరక్తి చెందినట్లే కనిపిస్తుంది. విడాకుల సమయంలోనే రెండవ పెళ్లి చేసుకోవాలా? ఒంటరి జీవితం గడప కూడదా? అంటూ వ్యాఖ్యానించింది. అయితే తాజాగా జాఫర్ ఇంటర్వ్యూలో సానియాకు హితబోద చేసాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదని, అజ్ఞానంతో చాలా మంది మంచి భవిష్యత్ ను ఒదిలేసుకుంటున్నారని..అలా ఆలోచించడం తప్పన్నారు.
విడాకులు అనేది దురదృష్టకరమని, ఎవరి జీవితం ఎప్పుడూ చీకటిలో ఉండి పోకూడదని హితవు పలికారు. అలాగే షోయబ్ మాలిక్ రెండవ పెళ్లి విషయాన్ని సానియా వద్ద ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాజాగా సానియా మీర్జా `కొత్త జీవితం ప్రారంభించాలి` అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో సానియా మనసు మారినట్లు కనిపిస్తుంది. రెండవ పెళ్లి చేసుకోవడానికి సానియా సిద్దంగా ఉన్నట్లు హింట్ ఇచ్చినట్లు అయింది. అయితే ఈసారి ఛాయిస్ ముస్లీం అబ్బాయి కాకుండా చూసుకోండి? అంటూ కొందరు పోస్టులు పెట్టగా? అందుకు మిశ్రమ స్పందన వస్తుంది. మనసుకు నచ్చిన ఎలాంటి వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చు? అని అందుకు మతాలతో సంబంధం ఏముంది? అంటూ మరికొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.