సానియా మీర్జా సిద్దంగా ఉన్నా ఎవరూ రావడం లేదా?
ఇక్కడ నుంచి సినిమా చేసి పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే మంచి సంచలనం అవుతుందనే అంచనా లున్నాయి.
టెన్నీస్ స్టార్ సానియా మీర్జా బయోపిక్ పై చాలా కాలంగానే చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ మేకర్స్ కొందరు తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటు టాలీవుడ్ లోకూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరబాద్ ప్లేయర్ కావడంతో? ఇక్కడ నుంచి సినిమా చేసి పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే మంచి సంచలనం అవుతుందనే అంచనా లున్నాయి. కానీ ఇంత వరకూ ఆమె బయోపిక్ కథ సిద్దమైనట్లు లేదు.
ప్రయత్నాలు జరుగుతున్నాయి? అనే మాట తప్ప ఏ డైరెక్టర్ పేరు అధికారికంగా మాత్రం ఇంత వరకూ విని పించలేదు. అయితే ఓ సందర్భంలో ఆమె బయోపిక్ లో నటించడానికి షారుక్ ఖాన్ కూడా సిద్దంగా ఉన్నట్లు చెప్పు కొచ్చారు. అలాగైతే అదే ప్రాజెక్ట్ లో తాను కూడా భాగమవుతానని ఓ ఇంటర్వ్యూలో సానియా మీర్జా కూడా ప్రక టించింది. అలాగని తన పాత్రలో తాను నటించదు. ఓ గెస్ట్ రోల్ చేస్తానంది.
అయితే సానియా పాత్రలో మాత్రం ఎవరు నటిస్తే బాగుంటుందన్నది కూడా చెప్పింది. దీపికా పదుకొణే కానీ, పరిణీతి చోప్రాలలో ఎవరో ఒకరు తన పాత్రకు న్యాయం చేయగలరు అనే ధీమాను వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్ప టికీ సాధ్యమవుతుందన్నది చూడాలి. సానియా మార్జా టెన్నీస్ కి రిటైర్మెంట్ ఇచ్చిన నాటి నుంచి ఈ వార్త ప్రచారంలో ఉంది. వృత్తి గత జీవితం పక్కనబెడితే? ఆమె వ్యక్తిగత జీవితంలో ఎంతో ఎమోషన్ ఉంది.
పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఓ బిడ్డకు తల్లైన తర్వాత విడాకులు తీసుకుంది. వివాహం సమయంలో భారత్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కుంది. షోయబ్ తో పెళ్లైన తర్వాత కొత్త కాపురం దుబాయ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. విడిపోయే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది.
ఇదంతా ఎంతో ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మంచి స్క్రిప్ట్ రెడీ అవుతుంది. మరి ఆ ఛాన్స్ ఏ దర్శకుడు తీసుకుంటాడో చూడాలి. మరి సానియా మీర్జా సిద్దంగా దర్శకులెవరూ ముందకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.