విసిగిపోయాను..అలిసిపోయాను ఇక న‌న్నేది అడ‌గొద్దు!

అప్ప‌టి నుంచి థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ ఎప్పుడంటూ అభిమానులు చాలాసార్లు అడిగారు.

Update: 2024-10-25 00:30 GMT

బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ 'మున్నాభాయ్' ప్రాంచైజీ స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఖ‌ల్న్ నాయ‌క్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన ప్రాంచైజీ అది. బాలీవుడ్ కెరీర్ లో ఎన్ని విజ‌యాలు ఉన్నా మున్నాభ‌య్ మాత్రం ప్ర‌త్యేక‌మైన చిత్రం. 2003లో రిలీజ్ అయిన 'మున్నాభాయ్ ఎంబీ బీఎస్'..దానికి సీక్వెల్గా 2006లో రిలీజ్ అయిన 'ల‌గే ర‌హో మున్నాభాయ్' ఎంత పెద్ద విజ‌యం సాధించాయో తెలిసిందే.

అప్ప‌టి నుంచి థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ ఎప్పుడంటూ అభిమానులు చాలాసార్లు అడిగారు. అందుకు రంగం ఇప్పుడు సిద్ద‌మ‌వుతోంది. దానికి సంబంధించిన ఓ వీడియోని కూడా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు. అధికారికంగా మున్నాభ‌య్ -3 రెడీ అవుతుందంటూ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణీ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆ చిత్రం గురించి సంజ‌య్ ద‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి న‌న్నేం అడగొద్దు.

అన్ని విష‌యాలు డైరెక్ట‌ర్ నే అడిగి తెలుసుకోండి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌ని ఇప్ప‌టికే అత‌డిని ఎన్నో సార్లు అడిగాను. రాజ్ కుమార్ ని అడిగి నేను అలిసి పోయాను త‌ప్ప అత‌డు మాత్రం చెప్ప‌లేదు. అందుకే దీని గురించి నేరుగా ఆయ‌న్నే అడ‌గండి. ఆయ‌నే స‌మాధానం ఇస్తారు' అని అన్నారు. ఈ సినిమాకి సంబంధించి రాజ్ కుమార్ క‌థ సిద్దం చేస్తున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టిచారు. మొత్తం ఆరు వెర్ష‌న్లు సిద్దం చేయ‌గా అవ‌న్నీ కూడా ఇంట‌ర్వెల్ వ‌ర‌కే సిద్ద‌మ‌య్యాయి.

పూర్తి క‌థ ఇంకా సిద్దం కాలేదు. అందుకు స‌మ‌యం కావాల‌న్నారు. విరామం నుంచి పెన్ను ఏమాత్రం ముందు కెళ్ల‌డం లేద‌ని స‌మ‌యం తీసుకుని చేస్తే త‌ప్ప సాధ్య‌మ‌వ్వ‌ద‌న్నారు. మ‌రి పూర్తి క‌థ ఎప్పుడు సిద్ద‌మ‌వుతుంది? అన్న‌ది రాజ్ కుమార్ హిరాణీ చేతుల్లో ఉంది. ఈయ‌న మూడు నాలుగేళ్ల‌కు ఒక సినిమా చేస్తుంటారు. కానీ సినిమా చేసారు? అంటే అది సంచ‌ల‌న‌మే అవుతుంది.

Tags:    

Similar News