సంక్రాంతి సినిమాలు సిద్ధమేనా.. ఎంతవరకు వచ్చాయి?
సంక్రాంతి సీజన్ అంటే తెలుగు ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ టైంలో వచ్చే సినిమాలలో చాలా వరకు కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటాయి
సంక్రాంతి సీజన్ అంటే తెలుగు ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ టైంలో వచ్చే సినిమాలలో చాలా వరకు కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటాయి. అందుకే హీరోలు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ముందుగానే కొన్ని సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకుంటాయి. తరువాత మరికొన్ని రేసులోకి వస్తాయి. పోటీ ఎక్కువైనపుడు నిర్మాతలు చర్చించుకొని డేట్స్ మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇదిలా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో మూడు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శంకర్ బిజీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొత్తం ఫినిష్ అయ్యాయి. ఇక ప్రస్తుతం శంకర్ ఎడిటింగ్ రూమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఈ మూవీతో మరల బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో శంకర్ ఉన్నారు. రామ్ చరణ్, దిల్ రాజుకి ఈ మూవీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో చరణ్ కి ఈ మూవీతో కచ్చితంగా సక్సెస్ రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దిల్ రాజు ఏకంగా 200 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. దీంతో అతనికి చాలా కీలకంగా మారింది. ‘గేమ్ చేంజర్’ కోసం మెగాస్టార్ ‘విశ్వంభర’ ని వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన నానా హైరానా అనే మెలోడీ సాంగ్ ట్రెండ్ అవుతోంది.
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ జనవరి 12న రిలీజ్ కావడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయిపొయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా నడుస్తోంది. VFX వర్క్స్ ప్రదానం కావడంతో రాత్రి పగలు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అంచనాలు పెంచేసింది. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తోనే ఈ మూవీ ఉండబోతోందని అనుకుంటున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సాంగ్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 బజ్ తగ్గితే సాంగ్స్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫెస్టివల్ రిలీజ్ కన్ఫర్మ్ అయిపొయింది. ఈ సినిమాలు దాదాపు ఫినిష్ అయ్యాయి. అనిల్ రావిపూడి టెన్షన్ లేకుండా ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటున్నారు.
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. రమణ గోగుల పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలలో ఏది సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందనేది వేచి చూడాలి. ముఖ్యంగా 'గేమ్ చేంజర్' సందడి మాత్రం డిసెంబర్ లో లో ఎక్కువ ఉండొచ్చని అనుకుంటున్నారు. పుష్ప 2 హడావిడి కనీసం 10 రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉంది. తరువాత నుంచి ఈ సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవ్వొచ్చని భావిస్తున్నారు.