డే 1 కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'

ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 25.72 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మంచి ఆక్యుపెన్సీతో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ స్టార్ట్ తీసుకుంది.

Update: 2025-01-15 08:25 GMT

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంటోంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకుంటోంది. ఫ్యామిలీ, కామెడీ, ఎమోషన్ల మేళవింపుతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు అందుకున్నాయి. ఇక మరోసారి అదే స్థాయిలో ఈ కాంబినేషన్ దుమ్ము రేపుతోంది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ పొందిన ఈ సినిమా మొదటి రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. విడుదలకు ముందు నుంచే సినిమాపై మంచి హైప్ ఉండటంతో ఫస్ట్ డే బుకింగ్స్ హౌస్‌ఫుల్‌గా ముగిశాయి.

పండుగ సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ బాగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సంక్రాంతికి వస్తున్నాం అనేక రికార్డులను బద్దలు కొట్టే దిశగా సాగుతోంది. బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 25.72 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మంచి ఆక్యుపెన్సీతో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ స్టార్ట్ తీసుకుంది.

కామెడీ తో పాటు వెంకటేష్ అభిమానులకు కావలసిన మాస్ ఎలిమెంట్లు ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫస్ట్ డే కలెక్షన్లలో నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అలాగే, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లలోనూ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు టాక్ బాగా ఉండటంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకర్షిస్తుందనే నమ్మకంతో మేకర్స్ భారీ ప్రమోషన్లు నిర్వహించారు. మొదటి రోజు సాధించిన వసూళ్లు చూస్తుంటే, సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సులభంగా చేరుకుంటుందని స్పష్టమవుతోంది.

ఫస్ట్ డే కలెక్షన్లు (షేర్):

నైజాం: 4.24 కోట్లు

ఈస్ట్ గోదావరి: 1.61 కోట్లు

వెస్ట్ గోదావరి: 1.40 కోట్లు

కృష్ణా: 1.70 కోట్లు

గుంటూరు: 1.65 కోట్లు

నెల్లూరు: 0.60 కోట్లు

విశాఖపట్నం: 1.50 కోట్లు

సీడెడ్: 3.02 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.00 కోట్లు

ఓవర్సీస్: 5.00 కోట్లు

మొత్తం: 25.72 కోట్లు

Tags:    

Similar News