'సంక్రాంతికి వస్తున్నాం'.. టీవీలో రేటింగ్ ఎంతంటే?

కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కనెక్ట్ అయ్యేలా చేసింది.;

Update: 2025-03-13 09:33 GMT

విక్టరీ వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి 300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి సాలీడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ సినిమా, ఇప్పుడు బుల్లితెరపైన కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఈ సినిమా అద్భుతమైన TRP రేటింగ్‌ను సాధించింది.

కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కనెక్ట్ అయ్యేలా చేసింది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో మిక్స్ చేసి అందించిన అనిల్ రావిపూడి మేకింగ్, వెంకటేశ్ టైమింగ్ అందరికీ నచ్చేసింది. ఇక ఓటీటీలో విడుదలైనప్పటికీ, టీవీలో కూడా భారీ TRP రావడం మాత్రం నిజంగా ఒక అద్భుతం.

SD ఛానెల్‌లో 15.92 రేటింగ్, HD ఛానెల్‌లో 2.3 రేటింగ్ రావడంతో మొత్తం TRP 18.22గా నమోదైంది. ఇది వాస్తవంగా చాలా గొప్ప ఫీట్. సాధారణంగా ఓటీటీ లో విడుదలైన సినిమాలు టీవీలో పెద్దగా రేటింగ్ సాధించలేవు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఈ మైండ్‌ బ్లోయింగ్ TRP తో మరోసారి సత్తా చాటింది. ఓటీటీ, థియేటర్, టీవీ అన్నీ కలిసి సినిమా ఎంతటి రేంజ్‌లో ప్రేక్షకులను ఆకర్షించిందో స్పష్టంగా తెలియజేస్తోంది.

సినిమా విడుదలకు ముందే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు పక్కా ఎంటర్‌టైనర్‌ అనే పేరు తెచ్చుకుంది. థియేటర్లలో అందుకున్న విజయాన్ని బుల్లితెరపై కూడా కొనసాగించింది. గతంలో అనిల్ F2, F3సినిమాలు కూడా టీవీలో హై TRP సాధించాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే ట్రాక్ లో చేరింది. ఈ సినిమాతో వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబో బయ్యర్లకు ఓ గోల్డ్ మైన్‌గా మారిపోయింది.

ఈ సినిమా మరోసారి నిరూపించిన విషయమేంటంటే.. మంచి కంటెంట్ తో వస్తే, సినిమాలు ఎక్కడైనా విజయం సాధిస్తాయనే సంగతి నిజమైంది. థియేటర్లలో సక్సెస్ అయిన సినిమా టీవీలోనూ అదే స్థాయిలో దూసుకుపోవడం చాలా అరుదు. అయితే సంక్రాంతికి వస్తున్నాం అందులో ఓ ఎక్సెప్షన్. ఈ సినిమాకు వచ్చిన ఈ భారీ టీఆర్‌పీ చూస్తే.. భవిష్యత్తులో ఈ తరహా కుటుంబ కథా చిత్రాలకు ఇంకా మంచి డిమాండ్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక ఈ విజయంతో వెంకటేశ్‌కి, అనిల్ రావిపూడికి భారీ ఊరట లభించింది. మరోవైపు ప్రేక్షకుల్లో కూడా టీవీలో సినిమా చూస్తే థియేటర్‌ రేంజ్‌ అనుభూతిని కలిగించేలా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News