సంక్రాంతికి వస్తున్నాం.. 6వ రోజు లెక్క ఎంతంటే?
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయింది.
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ కావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు, యూత్ నుంచి కూడా మంచి స్పందన రావడం గమనార్హం.
ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్‌ని సాధించింది. ప్రత్యేకంగా నైజాం, సీడెడ్ ఏరియాల్లో బ్లాక్‌బస్టర్ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఈ స్థాయి ఓపెనింగ్స్ వెంకటేష్ ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అనేలా రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ కు ఇది వరుసగా మూడో కమర్షియల్ హిట్ గా నిలిచింది.
సంక్రాంతి టైమ్ లో ఒక పాన్ ఇండియా సినిమా మరో యాక్షన్ సినిమా పోటీగా ఉన్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాలీడ్ కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్ అయిన మొదటి వారం ముగిసే లోపు ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం కావడం గమనార్హం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయింది.
సంక్రాంతి సెలవుల అనంతరం పర్ఫెక్ట్ వీకెండ్ పడడంతో 6వ రోజు కూడా భారీ కలెక్షన్లు సాధించడం విశేషం. శని ఆదివారం రోజు లెక్క.ఊహించని స్థాయిలో పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం, విశాఖపట్నం, సీడెడ్ ఏరియాల్లో ఈ సినిమా చరిత్ర సృష్టిస్తోంది. రోజురోజుకు ఈ చిత్రం కలెక్షన్ల పరంగా శరవేగంగా దూసుకెళ్తోంది.
6వ రోజు ఏరియా వారీగా కలెక్షన్లు (షేర్)
నైజాం: 4.01 కోట్లు
ఈస్ట్: 1.23 కోట్లు
వెస్ట్: 0.73 కోట్లు
కృష్ణా: 0.93 కోట్లు
గుంటూరు: 0.89 కోట్లు
నెల్లూరు: 0.39 కోట్లు
విశాఖపట్నం: 2.18 కోట్లు
సీడెడ్: 2.14 కోట్లు
మొత్తం AP/TS షేర్: 12.5 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 6వ రోజు షేర్: 16.12 కోట్లు
ఈ వేగం చూస్తుంటే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను సులభంగా దాటేలా కనిపిస్తోంది. వెంకటేష్ కెరీర్‌లోనే ఇది మరపురాని సినిమాగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఫైనల్ రన్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.