సంక్రాంతికి వస్తున్నాం.. ఓటీటీ రైట్స్ తో లాభమెంత?

థియేటర్లలో గ్రాండ్‌గా ఆడిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది.

Update: 2025-02-16 08:35 GMT

సంక్రాంతి బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. థియేటర్లలో గ్రాండ్‌గా ఆడిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే మూడోసారి హిట్ అందుకున్న నేపథ్యంలో, సినిమా ఓటీటీ హక్కులు భారీ డీల్‌లో అమ్ముడుపోయినట్టు టాక్.

ఇప్పటికే థియేట్రికల్ గా ఈ సినిమా బయ్యర్లకు మంచి ప్రాఫిట్స్ అందించింది. ప్రతీ డిస్ట్రిబ్యూటర్ కూడా పెట్టిన పెట్టుబడి కంటే కూడా ఊహించని లాభాలు అందుకున్నారు. ఇక నిర్మాత దిల్ రాజుకి దాదాపు 100 కోట్లకు పైగా ప్రాఫిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ నష్టాలను దిల్ రాజు ఈ సినిమాతో బ్యాలెన్స్ చేసుకున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ఈ సినిమాను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అయితే, ఓటీటీలో రిలీజ్‌కు ముందు టీవీలో ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో, ఇప్పటికి ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. సాధారణంగా థియేటర్లలో విజయవంతమైన సినిమాలు ఓటీటీలో కూడా భారీ వ్యూస్‌ను సాధిస్తాయి.

కానీ, ముందుగా టీవీలో ప్రసారం చేయడం వల్ల డిజిటల్ రన్ ఎలా ఉంటుందో చూడాలి. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి వినోదాన్ని అందించింది. ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్, ప్రస్తుత భార్య.. ఈ ముగ్గురి మధ్య సాగే కథ ఎంతో ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. యాక్షన్, కామెడీ మిక్స్ చేసి రూపొందించిన ఈ కథలో, వెంకటేష్ అద్భుతంగా ఆకట్టుకున్నారు.

ఆయన సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, నరేశ్, సాయి కుమార్, ఉపేంద్ర లిమాయే, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను థియేటర్లకు బలంగా రప్పించడంలో విజయం సాధించింది. గతంలో వెంకటేష్‌తో కలిసి F2, F3 లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన అనిల్, ఈసారి కూడా అదే కమర్షియల్ ఫార్ములా ఫాలో అయ్యారు.

ప్రేక్షకులకు నచ్చే కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి, ఈ సినిమాను రూపొందించడం వల్లే మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. 2027 సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం 2 ప్రేక్షకుల ముందుకు రానుందని వెంకటేష్ ప్రకటించారు. వెంకటేష్ ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ రాణా నాయుడు 2 కోసం రెడీ అవుతున్నారు. ఇక, సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో ఎప్పుడు వస్తుందో, మరోసారి ఈ సినిమా మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News