సంక్రాంతి పోరు.. ఒత్తిడి మొత్తం ఆయనపైనే..

కానీ ఇన్ని చిత్రాలు ఒకేసారి రావడం ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కాస్త ఒత్తడి పెంచేలా ఉంది. అందుకు కారణం ఏంటంటే.

Update: 2023-10-06 15:30 GMT

వచ్చే ఏడాది 2024 సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ రసవత్తరంగా మారనుంది. దాదాపు 8 సినిమాలు పోటీ పడనున్నాయి. సూపర్ స్టార్ మహేశ్​ బాబు గుంటూరు కారం, రవితేజ పాన్ ఇండియా మూవీ ఈగల్, నాగార్జున నా సామి రంగ, తేజ సజ్జ హనుమాన్, విజయ్ దేవరకొండ - పరశురామ్​ మూవీ, వెంకటేశ్ సైంధవ్​తో పాటు.. ఇంకా పలు డబ్బింగ్ చిత్రాలు రేసులో ఉన్నాయి.

అయితే ఇన్ని డిఫరెంట్ జానర్ సినిమాలు ఒకేసారి రావడం సినీ ప్రియులకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయం అనే చెప్పాలి. కానీ ఇన్ని చిత్రాలు ఒకేసారి రావడం ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కాస్త ఒత్తడి పెంచేలా ఉంది. అందుకు కారణం ఏంటంటే.. ఈ సంక్రాంతి సినిమాలో రానున్న విజయ్ దేవరకొండ-పరశు రామ్ ప్రాజెక్ట్‌ దిల్​ రాజు సొంత బ్యానర్​ నుంచే రాబోతుంది. అలానే రానున్న ఇతర సినిమాల్లో మూడు చిత్రాలు నైజాం హక్కులను ఆయనే కొనుగోలు చేశాడు.

వీటిలో మహేశ్ బాబు గుంటూరు కారం ఒకటి. సంక్రాంతి అతిపెద్ద స్పెషల్ అట్రాక్షన్ చిత్రం ఇదే. ప్రేక్షకులంతా మొదట ఈ సినిమా చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత దేవరకొండ సహా ఇతర చిత్రాలకు వెళ్తారు. కాబట్టి.. దిల్ రాజు తన సొంత బ్యానర్ చిత్రంతో పాటు కొనగోలు చేసిన ఇతర చిత్రాలనూ బ్యాలెన్స్ చేస్తూ థియేటర్లను సర్దుబాటు చేయాలి.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దిల్​ రాజు.. ఇతర సినిమాల మేకర్స్​తో మాట్లాడి రిలీజ్ డేట్స్​ను మార్చడానికి ఒప్పించే ప్రయత్నం చేసేవారు. కానీ ఈ సారి సంక్రాంతి సీజన్ కావడం వల్ల అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి సినిమాలకు ఉన్న హైప్ స్థాయిని బట్టి.. థియేటర్లను కేటాయించేలా చూసుకోవాలి. ఇదంతా అంత ఈజీ ప్రాసెస్ కాదు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా దిల్​రాజుపై కాస్త ఒత్తిడి తీసుకువస్తుందనే చెప్పాలి. చూడాలి మరి ఈ సిట్యూయేషన్​ను దిల్​ రాజు ఎలా హ్యాండిల్ చేస్తారో.

Tags:    

Similar News