వెన్నెల కొషోర్ 'సంతాన ప్రాప్తిరస్తు' - ఈ లుక్కు చూశారా?
ఈ పాత్ర ప్రత్యేకంగా కొన్ని రియల్ లైఫ్ స్పెషలిస్టుల నుంచి ప్రేరణ పొందిందట. దీన్ని తెరపై ఎలా చూపించబోతున్నారన్నది పెద్ద ఆసక్తి రేకెత్తిస్తోంది.
తెలుగు చిత్రసీమలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మరో వినూత్నమైన కుటుంబ కథా చిత్రం రాబోతోంది. విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా ప్రారంభంలోనే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ బంధాలను, సంగీతాన్ని ప్రధానంగా మేళవిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి మరో విశేషమైన అప్‌డేట్ బయటకొచ్చింది.
కామెడీ టైమింగ్‌కి పెట్టింది పేరైన వెన్నెల కిషోర్ ఈ సినిమాలో 'డాక్టర్ భ్రమరం' అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర లుక్ పోస్టర్ తాజాగా విడుదల చేయగా, దీని వెనుక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉందని చిత్రబృందం చెప్పింది. ఆయన పాత్ర చుట్టూ నిర్మించిన 'గర్భగుడి వెల్నెస్ సెంటర్' నేపథ్యం వినసొంపుగా ఉంటుందట. సైన్స్‌తో కలిపిన సర్కాసం, నవ్వులతో మిక్స్ చేసి మతలబులు.. ఈ పాత్రలో వెన్నెల కిషోర్ టోటల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు హద్దులు చెరిపేస్తాడని అంటున్నారు.
ఇటీవల విడుదలైన ఈ కొత్త క్యారెక్టర్ పోస్టర్ ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచింది. వెన్నెల కిషోర్ ఓ వైపు గర్భసంచార వైద్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్‌కి సంబంధించి ఉన్నతమైన డిగ్రీలు, మరోవైపు వ్యంగ్యాన్ని తన వైద్యంలో కలిపిన 'అన్‌కన్‌వెన్షనల్' డాక్టర్ అవతారం.. ఇది తెరపై మరింత వినోదాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాత్ర ప్రత్యేకంగా కొన్ని రియల్ లైఫ్ స్పెషలిస్టుల నుంచి ప్రేరణ పొందిందట. దీన్ని తెరపై ఎలా చూపించబోతున్నారన్నది పెద్ద ఆసక్తి రేకెత్తిస్తోంది.
'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాని మాధురా ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన కథ, వినోదాత్మకమైన కథనం, మంచి సంగీతం కలబోసిన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వినసొంపైన పాటలతో పాటు మంచి కామెడీ కథనం ప్రేక్షకులకు కనువిందు చేయనుందని చిత్రబృందం తెలిపింది.
టాలీవుడ్‌కి విభిన్నమైన చిత్రాలను అందించే దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన గతంలో 'ABCD', 'ఆహా నా పెళ్లంట' (వెబ్ సీరీస్) వంటి ప్రాజెక్టులతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్లు బయటకు రానున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.