ఆసక్తి రేకెత్తిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు'

సంక్రాంతి సందర్భంగా నేడు చాలా సినిమాల పోస్టర్స్‌, టీజర్స్‌ ఇంకా చాలా అప్డేట్స్‌ వచ్చాయి.

Update: 2025-01-14 14:19 GMT

సంక్రాంతి సందర్భంగా నేడు చాలా సినిమాల పోస్టర్స్‌, టీజర్స్‌ ఇంకా చాలా అప్డేట్స్‌ వచ్చాయి. కానీ ఎక్కువ శాతం మంది చిన్న సినిమా అయినా సంతాన ప్రాప్తిరస్తు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. టైటిల్‌ విభిన్నంగా ఉండటంతో పాటు, పోస్టర్‌ సైతం చాలా విభిన్నంగా డిజైన్ చేశారు. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌తో హీరో హీరోయిన్‌ను చూపించడంతో సినిమా కాన్సెప్ట్‌ దాదాపుగా తెలిసి పోయింది. వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుందని పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతుంది. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన చిన్న సినిమాలు గత ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగు ప్రేక్షకులు కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా వచ్చిన సినిమాలు ఆధరిస్తారని ఇప్పటికే చాలా సార్లు నిరూపితం అయ్యింది. అందుకే ఈ సినిమాకి మరోసారి తెలుగు ప్రేక్షకులు హిట్‌ ఇస్తారనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని కాన్సెప్ట్‌ నుంచి మొదలుకుని ప్రతి ఒక్క సన్నివేశం వినోదాత్మకంగానే కాకుండా ఆలోచింపజేసే విధంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది అని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా రూపొందుతున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో వెన్నెల కిషోర్‌, అభినవ్‌ గోమటం, మురళీధర్‌ గౌడ, జీవన్‌ కుమార్‌, తాగుబోతు రమేష్‌, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ అందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా నుంచి మంచి కమెడియన్స్ ఉండటంతో కామెడీకి ఢోకా ఉండదు అనేది యూనిట్ సభ్యుల మాట. ఇంతకు ముందు ఏబీసీడీ అనే సినిమాను అల్లు శిరీష్‌తో రూపొందించి దర్శకుడిగా పాస్ మార్కులు దక్కించుకున్నాడు సంజీవ్ రెడ్డి.

ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో ఆహా నా పెళ్లంట అనే వెబ్‌ సిరీస్‌ను రూపొందించాడు. ఆ వెబ్‌ సిరీస్‌కి మంచి స్పందన వచ్చింది. అవే కాకుండా మెగాస్టార్‌ చిరంజీవితో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్‌ యాడ్‌ను తెరకెక్కించాడు. దర్శకుడిగా చాలా అనుభవం ఉన్న సునీల్‌ రెడ్డి ఈ సారి కమర్షియల్‌ హిట్‌ కొట్టడం కోసం సంతాన ప్రాప్తిరస్తు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఏక్‌ మినీ కథ వంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించిన షేక్ దావుద్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. త్వరలోనే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News