డెబ్యూ చిత్రమే దెబ్బేసావ్ కదా బాస్!
భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన `సికిందర్` చిత్రంపై రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా లేని తెలిసిందే.;

భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన `సికిందర్` చిత్రంపై రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా లేని తెలిసిందే. మురగదాస్ మరోసారి రొటీన్ సినిమా చేసాడని ప్రేక్షకులు పెదవి విరిచేసారు. మురగదాస్ మ్యాజిక్ ఏమైపోయిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ నటన విషయంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాడీ డబుల్ టెక్నాలజీ వాడి సల్మాన్ ఖాన్ లేకుండా షూటించేసారని..ఆ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని మోసం చేసారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
ఇదే `సికిందర్` కు పెద్ద దెబ్బ అనుకుంటే పుండు మీద కారం జల్లినట్లు సంతోష్ నారాయణ సంగీతం విషయంలో కూడా ఆర్ ఆర్ ప్రియులు పెదవి విరిచేస్తున్నారు. సంతోష్ పనితీరుపై నిరుత్సాహం వ్యక్తమ వుతోంది. అతడు అందించిన ఆర్ ఆర్ ఏమాత్రం ఎగ్జైట్ మెంట్ తీసుకు రాలేదని...అంతా రోటీన్ గా ఉందం టన్నారు. ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆర్ ఆర్ పైకి లేపుతుంది. కానీ `సికిందర్` విషయంలో ఆర్ ఆర్ కిందకు తొక్కినట్లు ఉందని అంటున్నారు.
అతడి గత చిత్రాలకు అందించిన స్కోర్...ఈ చిత్రానికి అందించిన స్కోర్ పోలిక చేస్తూ ఇంత పేలవమైన ఆర్ ఆర్ ఎలా సాధ్యమైంది? అంటూ అతడిపైనా అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. హిందీలో తొలి చిత్రానికి ఇలా దేబ్బేసావ్? ఏంటి బాస్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే ఆయన పక్షపాత వైఖరి ప్రదర్శిం చాడని ఆరోపిస్తున్నారు. గతంలో ఆయన ఎన్నో తమిళ సినిమాలకు మంచి సంగీతం, ఆర్ ఆర్ అందించారు.
వాటితో `సికిందర్` ఆర్ ఆర్ పోల్చుతూ ఇది పక్షపాతం కాదంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంతోష్ నారాయణ కోలీవుడ్ లో చాలా సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించారు. ఆర్ ఆర్ లో స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసాడు. `కల్కి 2898`, `సైంధవ్`, `దసరా`,` కాలా`, `కబాలీ` లాంటి చిత్రాలకు సంతోష్ ఎలాంటి ఆర్ ఆర్ అందించాడో తెలిసిందే. విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. కానీ `సికిందర్` విషయంలో అదే ప్రశంసకులు విమర్శిస్తున్నారు.