రిజిస్టర్ మ్యారేజ్ కి ఫిక్సైన హీరో!
పెళ్లంటే మూడు రోజుల పండుగ. ఊరంతా పందిరి వేయాలి. భాజ భజంత్రీలు..చుట్టాలు..పట్టాలు ఇలా బోలెడంత హడావుడి ఉంటుంది
పెళ్లంటే మూడు రోజుల పండుగ. ఊరంతా పందిరి వేయాలి. భాజ భజంత్రీలు..చుట్టాలు..పట్టాలు ఇలా బోలెడంత హడావుడి ఉంటుంది. రెండు వారాలు ముందుగానే అంతా పెళ్లి పనుల్లో బిజీ అవుతుంటారు. కానీ యంగ్ హీరో సంతోష్ శోభన్ మాత్రం ఇలాంటి హడావుడి ఏది ఉండకూడదు అంటున్నాడు. పెళ్లి చాలా సింపుల్ గా ఉండాలంటున్నాడు. తను పెళ్లి చేసుకుంటే గనుక సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడుట. ఎలాంటి హడావుడి లేకుండా ఎంత నిరాడంబరంగా జరిగితే అంత సంతోషంగా ఉంటాడుట.
ఎట్టి పరిస్థితుల్లో వేడుకగా మాత్రం చేసుకోడుట. డెస్టినేషన్ వెడ్డింగ్ కి యంగ్ హీరో యాంటీగానే కనిపిస్తున్నాడు. మరి తనలో ఈ రకమైన మార్పుకి కారణం ఏంటి? అంటే కొన్ని సినిమాలని తెలుస్తోంది. పెళ్లి నేపథ్యంలో సినిమాలు చేస్తున్నారు? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అంటే ఈ విషయాలన్ని బయటకు వచ్చాయి. ప్రస్తుతానికి ఇంట్లో పెళ్లి గురించి ప్రస్తావన రాలేదు. పెళ్లి నేపథ్యంలో సినిమాలు చేసి బోర్ కొట్టేసింది. పెళ్లి దుస్తులు చూడగానే నిరుత్సాహం వచ్చేస్తుంది.
దర్శకులు పెళ్లి దుస్తులు వేయింది..అవే దుస్తుల్లో పరుగులు పెట్టిస్తున్నారు. షూటింగ్ సమయంలో ఎన్నిసార్లు కిందపడ్డానో కూడా తెలియదు. ఇవన్నీ చూసి నిజ జీవితంలో పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఓ పెళ్లి జరగాలంటే ఎన్ని తంతులు పూర్తి చేయాలో సినిమాల ద్వారా అర్ధమైంది. ఇవన్నీ చూసి వద్దు రా బాబు అనిపిస్తుంది' అని అన్నారు.
ఇక యంగ్ హీరో సినిమాల విషయానికి వస్తే సినిమాలు బాగానే చేస్తున్నాడు. కానీ ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? ఎప్పుడు థియేటర్ నుంచి పోతున్నాయో? అర్దం కాని సన్నివేశం. వాటికి పెద్దగా ప్రచారం కల్పించకపోవడంతో? ఏది సంతోష్ శోభన్ సినిమానో కూడా అర్ధం కావడం లేదంటున్నారు. నేడు ఆయన నటించిన 'ప్రేమ్ కుమార్' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి పెద్ద గా ప్రచారం కల్పించకపోవడంతో? బజ్ క్రియేట్ అవ్వలేదు. రిలీజ్ కూడా చాలా సైలెంట్ గా జరిగిపోయింది.