హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సుదీప్ కూతురు!?
ఆ సినిమా తర్వాత సుదీప్ కన్నడలో చేసిన సినిమాలన్నీ తెలుగు లో కూడా రిలీజవుతున్నాయి.
శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా సుపరిచితుడే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో విలన్ గా గుర్తుండిపోయాడు సుదీప్. ఈగ మూవీలో సుదీప్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసించారు. ఆ సినిమా తర్వాత సుదీప్ కన్నడలో చేసిన సినిమాలన్నీ తెలుగు లో కూడా రిలీజవుతున్నాయి.
మధ్యలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన సుదీప్ ఆ తర్వాత నుంచి తెలుగులో మాత్రం సినిమాలు చేసింది లేదు. తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయకపోయినా ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడలో సుదీప్ స్టార్ హీరోగా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రీసెంట్ గా ఆయన నటించిన మ్యాక్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కన్నడ బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు సుదీప్. రీసెంట్ గానే ఓ సీజన్ ను ముగించిన సుదీప్ స్క్రీన్ పై ఎంతో ఫిట్ గా కనిపిస్తాడు. ఆయన వయసు 52 సంవత్సరాలంటే ఎవరూ నమ్మరు.
అంతేకాదు 52 ఏళ్ల సుదీప్ కు 21 సంవత్సరాల కూతురు కూడా ఉంది. సుదీప్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి కన్నడ ఆడియన్స్ కు మాత్రం బాగా తెలుసు. సుదీప్ కూతురి పేరు సాన్వీ సుదీప్. సోషల్ మీడియాలో సాన్వీకి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు సాన్వీ సుదీప్ పేరు కన్నడ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది.
ఇప్పటికే తన అందాలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న సాన్వీ సుదీప్, త్వరలోనే సినిమాల్లోకి రానుందని కన్నడ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే సాన్వీకి యాక్టింగ్ కంటే సింగింగ్ అంటేనే ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పింది. అందులో భాగంగానే అమ్మడు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆల్రెడీ సాన్వీ జిమ్మీ అనే సినిమాలో ఓ పాట కూడా పాడగా, త్వరలో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతుందని అంటున్నారు. సుదీప్ ఫ్యాన్స్ సాన్వీ ఎంట్రీ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నారు.