ఆ విమర్శలను ఎలా తట్టుకున్నానంటే..
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి అందరికీ తెలుసు. సైఫ్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన సారా అలీ ఖాన్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.;

సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి అందరికీ తెలుసు. సైఫ్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన సారా అలీ ఖాన్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇయర్ ఆల్రెడీ స్కై ఫోర్స్ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించి ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది సారా. తండ్రి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది సారా అలీఖాన్.
ఇదిలా ఉంటే సారా అలీ ఖాన్ రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొని అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. కెరీర్ స్టార్టింగ్ లో తనపై సోషల్ మీడియాలో ఎంతో ట్రోలింగ్ జరిగిందని, తన యాక్టింగ్ గురించి చాలా మంది విమర్శించేవారని, అయినప్పటికీ తాను ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదని సారా అలీఖాన్ వెల్లడించింది.
సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీని, ట్రోలింగ్ ను తాను ఎలా ఎదుర్కొందో కూడా ఈ ఇంటర్వ్యూలో సారా తెలిపింది. తనపై వచ్చిన విమర్శలన్నింటినీ ఫిల్టర్ చేసి వాటిని అధిగమించడానికి ప్రయత్నించానని, ఈ విషయంలో తనకు మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడిందని, ధ్యానం చేయడం వల్ల తనకు అసలు నిజమేంటనేది తెలుస్తోందని సారా చెప్పింది.
ధ్యానం వల్ల తన ఆలోచనా విధానం ఎంతో మెరుగుపడిందని, సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పాటూ ప్రతీ విషయాన్నీ సొంత ఆలోచనలతో చూడటం మొదలుపెట్టినట్టు సారా చెప్పుకొచ్చింది. అలా అని తన ప్రతీ ఆలోచనను సమర్థించుకోనని, తానేమీ నటిగా మంచి పొజిషన్ లో లేనని, ఆ విషయం తనకు కూడా తెలుసని సారా ఈ సందర్భంగా తెలిపింది.
అందరికీ అందరూ నచ్చాలని రూలేం లేదని, కొంతమందికి కొందరు నచ్చుతారని, మరికొందరు నచ్చరని, నటిగా తాను ఇంకా చాలా జర్నీ చేయాలనుకుంటున్నానని, దేవుడు ఛాన్స్ ఇస్తే హీరోయిన్ గా ఎక్కువ కాలం ఉండి ఆ తర్వాత నిర్మాతగా, ఎంటర్‌ప్రెన్యూర్ గా మారతా అని చెప్పిన సారా ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే సినిమాలో నటిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.