ఆ పావుగంట ఓ జీవిత కాలంలా అనిపించింది
ఈ విషయంపై సైఫ్ కూతురు, నటి సారా అలీఖాన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.;

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై కొన్ని నెలల కిందట ఎటాక్ జరిగిన విషయం తెలిసిందే. అర్థరాత్రి టైమ్ లో ఒక దుండగుడు సైఫ్ ఇంట్లోకి దూరి ఆయన చిన్న కొడుకు జేహ్ రూమ్ లోకి వెళ్లబోయాడు. ఆ దొంగను గుర్తించిన ఇంటి హెల్పర్ పెద్దగా అరవడంతో సైఫ్ అతని దగ్గరకి వెళ్లడం, అక్కడ పెనుగులాట జరగడం అయ్యాయి.
ఈ పెనుగులాటలో సైఫ్ పై ఆ దుండగుడు కత్తితో దాడి చేయగా సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫ్ కూతురు, నటి సారా అలీఖాన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన తండ్రికి జరిగిన ప్రమాదం గురించి తెలియగానే తామెంతో కంగారు పడ్డామని, అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా అయోమయ స్థితిలో పడిపోయామని చెప్పుకొచ్చింది.
ఆ విషయం తెలియగానే అందరం షాక్ లో ఉన్నామని చెప్పిన సారా తనకు ఆ క్షణంలో ఏం జరిగిందో పెద్దగా గుర్తు లేదని, ఏం జరుగుతుందో అర్థం కాలేదని తెలిపింది. తన తండ్రికి ఏమీ కాకుండా బయటపడినందుకు తామెంతో అదృష్టవంతులవంతుని చెప్తోన్న సారా అలీఖాన్ తాము హాస్పిటల్ కు వెళ్లే వరకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయని, ఆయన హెల్త్ సిట్యుయేషన్ గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారని ఆ పావుగంట తనకొక జీవిత కాలం లాగా అనిపించిందని సారా వెల్లడించింది.
హాస్పిటల్ నుంచి మళ్లీ తన తండ్రి చిరునవ్వుతో బయటకు వచ్చేంతవరకు తన మనసు కుదుటగా లేదని, ఆయన నవ్వు చూశాకే తనకు ప్రశాంతంగా అనిపించిందని, ఫ్యామిలీని ఇబ్బంది, కంగారు పెట్టకూడదని ఆ టైమ్ లో తన తండ్రి ఎంతో గుండెనిబ్బరంతో ఉన్నారని, ఎలాంటి పరిస్థితిలోనైనా తన తండ్రి ఆఖరి వరకు ఫైట్ చేసి తాను అనుకున్నది సాధిస్తారని సారా అలీఖాన్ తెలిపింది.
అయితే ఈ విషయంలో తండ్రి ధైర్యం తనకు రాలేదని సారా చెప్తోంది. తండ్రి లాగా తాను ప్రతీ విషయాన్నీ ఎదుర్కోలేనని, మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో తాను చాలా సెన్సిటివ్ గా ఉంటానని చెప్తోంది సారా అలీఖాన్. ఇలాంటి పరిస్థితులు తనకు ఎప్పుడైనా ఎదురైతే ముందే కన్నీళ్లు పెట్టుకుని కంగారు పడిపోతానని సారా తెలిపింది.