బీచ్ లో అందాల సారా.. పిక్స్ వేరే లెవెల్..

అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు.

Update: 2024-10-29 10:02 GMT

సారా టెండూల్కర్.. ఈ ముద్దుగుమ్మ గురించి అందరికీ తెలిసిందే. మాస్టర్ సచిన్ గారాలపట్టిగా క్రికెట్ అభిమానులందరికీ సుపరిచితమే. పాతికేళ్ల వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సారా. సొంత వ్యాపారాన్ని నడిపిస్తూ దూసుకుపోతున్నారు. కొరియన్ బ్రాండ్ అంబాసిడర్ గా పెద్ద మొత్తంలో ఎర్న్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు.


ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ ను షేర్ చేస్తుంటారు. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను పోస్ట్ చేస్తుంటారు. అలా 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా సారా గోవాకు వెళ్లారు. తన బర్త్ డే వీకెండ్ ను అక్కడే జరుపుకున్నారు. బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించి ఆమె పోస్ట్ చేసిన పిక్చర్స్.. సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.


బ్లూ కలర్ స్విమ్ సూట్ వేసుకున్న సారా టెండూల్కర్.. తన గ్లామర్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. స్టైలిష్ గా ఫిదా చేశారు. రకరకాల పోజులతో మెమరిపించారు. ఇయర్ రింగ్స్, నెక్ చైన్ తో సింపుల్ గా కనిపించారు. తన గ్లోయింగ్ స్కిన్ తో మైండ్ బ్లాక్ చేశారు. సరైన బీచ్ అవుట్ ఫిట్ లో ఆడుకుంటూ సందడి చేశారు. సారా ఫోటోలు అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొడుతూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.


ఇక సారా విషయానికొస్తే.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకున్నారు. యూనివర్సిటీ కాలేజీ లండన్ నుంచి డిస్టెన్స్ లెర్నింగ్‌ తో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అయితే సారాకు మొదటి నుంచి మోడలింగ్, ఫ్యాషన్ అంటే ఇష్టం. దీంతో తన తండ్రి సపోర్ట్ తో దూసుకెళ్తున్నారు. సచిన్ పేరును నిలబెడుతున్నారు. కొన్నేళ్ల క్రితం తన మోడలింగ్ వృత్తి స్టార్ట్ చేశారు. వివిధ దేశాల్లో జరిగిన ఫ్యాషన్ ర్యాంప్ వాక్స్ లో పాల్గొన్నారు.


ఇప్పుడు వివిధ వ్యాపారాలు నడిపిస్తున్న సారా.. స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్ అయ్యేలా కనిపిస్తున్నారు. అయితే క్రికెటర్ శుభమన్ గిల్ తో ఆమెలో ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. శుభమన్ గానీ సారా గానీ డైరెక్ట్ గా చెప్పలేదు. మరి అందాల ముద్దుల చందమామగా కనిపించే సారా.. బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోస్ ను చూశారా?

Tags:    

Similar News