ట్రెండింగ్: టెండూల్కర్ కూతురు (X) గంగూలీ కూతురు
సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ..ఆ ఇద్దరూ సమకాలిక క్రికెటర్లు. టీమిండియా బెస్ట్ ఓపెనింగ్ జోడీ కూడా. ప్రపంచకప్ టోర్నీలలో కలిసి ఆడారు.
సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ..ఆ ఇద్దరూ సమకాలిక క్రికెటర్లు. టీమిండియా బెస్ట్ ఓపెనింగ్ జోడీ కూడా. ప్రపంచకప్ టోర్నీలలో కలిసి ఆడారు. ఎన్నో విజయవంతమైన మ్యాచ్ లతో టీమిండియా గౌరవాన్ని పెంచారు. భారత క్రికెట్ అభివృద్ధికి సహకరించిన నిష్ణాతులు. అయితే వారి తరం వెళ్లింది. ఇప్పుడు కొత్తగా స్టార్ క్రికెటర్లు ప్రవేశించారు.
అయితే టెండూల్కర్, గంగూలీ కంటే ఇప్పుడు ప్రజల కళ్లు వారి అందమైన కుమార్తెలపైనే. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ. మోడల్ గా సారా రాణిస్తోంది. అలాగే సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ అందం, ఆకర్షణలో ఎందులోను తగ్గదు. ఈ ఇద్దరి వయస్సు, విద్యా అర్హతల గురించి యూత్ ఎక్కువగా చర్చిస్తోంది.
సారా టెండూల్కర్ 1997 అక్టోబర్ 12న జన్మించారు. ప్రస్తుతం ఆమెకు 27 సంవత్సరాలు. సనా గంగూలీ 2021 నవంబర్ 3న జన్మించారు. ప్రస్తుతం ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. ఇద్దరి మధ్యా నాలుగేళ్ల వయసు గ్యాప్ ఉంది. ఒకే జెనరేషన్ లో వేవ్స్ క్రియేట్ చేస్తున్న అందగత్తెలు.
సారా టెండూల్కర్ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెరిగారు. ప్రతిష్టాత్మక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను పూర్తి చేశారు. తన తల్లి ఆరోగ్య సంరక్షణ వృత్తి నుండి ప్రేరణ పొందిన సారా ఈ రంగంలో ఆసక్తిని పెంచుకుంది. లండన్‌లో తన విద్యను కొనసాగిస్తోంది. సారా ఎంతో అంకితభావంతో లండన్ మెడికల్ కాలేజీలో చేరింది. అక్కడ ఆమె వైద్య వృత్తి లో ఉన్నత చదువును కొనసాగిస్తోంది. సనా గంగూలీ కోల్‌కతాలోని లోరెటో హౌస్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను ప్రారంభించింది. ఆమె విద్యా నైపుణ్యం ఆమెకు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (UCL)లో స్థానం సంపాదించిపెట్టింది. వర్శిటీలో ఈ యంగ్ బ్యూటీ ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించింది. యుసిఎల్‌లో ఉన్నప్పుడు సనా అంకితభావంతో కూడిన విద్యార్థిగా మాత్రమే కాకుండా అనేక ఇంటర్న్‌షిప్‌లలో కూడా పాల్గొంది. సనా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఈ ఇద్దరు క్రికెటర్ల కుమార్తెలు గొప్ప స్థానానికి ఎదుగుతారని అభిమానులు భావిస్తున్నారు.