వైరల్ వీడియో: సారా టెండూల్కర్‌లో నాటీని చూశారా?
మరోవైపు సారా సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వారసురాలు సారా టెండూల్కర్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ యువకథానాయికలకు ఏమాత్రం తీసిపోని అందగత్తె. టాప్ మోడల్ గా, ఫ్యాషనిస్టాగా సుపరిచితం. సారా నటించిన వాణిజ్య ప్రకటనలు ఇంతకుముందు టెలీకాస్ట్ అయ్యాయి. అలాగే బాలీవుడ్ కథానాయికలు, సెలబ్రిటీలతో సారా టెండూల్కర్ సాన్నిహిత్యం గురించి తెలిసిందే. యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు షికార్ చేసినా కానీ దానికి అధికారిక సమాచారం లేదు. మరోవైపు సారా సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. ఇక్కడ నిరంతర ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా సారా టెండూల్కర్ బీచ్ వెకేషన్ లో ఉన్నప్పటి ఓ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో సారా టెండూల్కర్ `బీచ్ డే`ని ఆస్వాధిస్తోంది. ఈ పర్యటనలో సారా ఎంతో జాలీగా గడిపేస్తోంది. సారా ఈ వీడియోలో నాటీగా కనిపిస్తోంది. బీచ్‌లో ఓ చోట తీరిగ్గా కూచుని వీక్షకులను నాటీగా టీజ్ చేస్తోంది. అలా గాల్లోకి ఎగరవేసిన పండును నోటితో అందుకునే ప్రయత్నం చేస్తుంటే అది దూరంగా పడిపోయింది. అయితే సారా తన ప్రయత్నాన్ని విరమించలేదు. చివరికి పండు(పుచ్చ కాయ ముక్కలు, బ్లూ బెర్రీస్) తన నోటికి చిక్కింది. అలా పండును అందుకున్న తర్వాత సారా కన్ను గీటుతూ కొంటెగా కనిపించింది.
ఇటీవల బ్రిస్బేన్‌లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన సారా ఆ తర్వాత కొంత సమయాన్ని విహారయాత్రకు కేటాయించింది. అక్కడ బీచ్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలింది. క్వీన్స్‌లాండ్‌లోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో నాణ్యమైన సమయాన్ని గడిపింది. బీచ్ షికార్‌లో అలసిపోయిన తర్వాత, సారా తాజా పండ్లను తినేందుకు ప్రయత్నించింది. బీచ్‌లోని అందమైన దృశ్యాన్ని ఆస్వాధిస్తూ ఇలా సరదాగా ఓ వీడియోకి ఫోజులిచ్చింది.
సారా ఈ వెకేషన్‌లో మినీ జలాంతర్గామిలో ప్రయాణించి పగడపు దీవిలోకి ప్రవేశించింది. అలాగే డైవింగ్ , స్నార్కెలింగ్ వంటి సాహసక్రీడలను ఆస్వాధించింది. ప్రపంచంలోని అత్యుత్తమ పగడపు దిబ్బలలో అరుదైన సముద్ర జీవుల మధ్య ఈత కొట్టడం వంటి సరికొత్త అనుభూతులను ఆస్వాధించింది.