ఏ హీరోయిన్‌ చేయని సాహసాన్ని మళ్లీ మళ్లీ చేస్తోంది..!

బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది

Update: 2023-10-31 09:23 GMT

హీరోయిన్స్ అంటే సున్నితంగా ఉంటారు, పార్టీ లు పబ్‌ లు అంటూ తిరుగుతూ ఆఫర్ల కోసం సర్కిల్స్ ఏర్పాటు చేసుకుని వారితో గడుపుతూ ఉంటారు అని అంతా అనుకుంటూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ అలాగే ఉంటారు. కానీ కొద్ది మంది హీరోయిన్స్ మాత్రం అందరి కంటే భిన్నంగా ఉంటారు.. హీరోయిన్స్ ఇలా కూడా చేస్తారా అనుకునే విధంగా ఉంటున్నారు.

బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది. స్టార్‌ కిడ్ ఇమేజ్ నుంచి బయట పడి సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకునే ప్రయత్నం లో సారా అలీ ఖాన్‌ సఫలం అయింది. ఇప్పటికే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

సాధారణంగా హీరోయిన్స్ ఆధ్యాత్మిక యాత్ర లు చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా కేదార్ నాథ్ వంటి హిమాలయ పర్వత యాత్ర లు చేయడం మనం చూడం. కానీ సారా అలీ ఖాన్‌ మాత్రం మళ్లీ మళ్లీ కేదార్ నాథ్ యాత్ర చేస్తూ ఉంటుంది.

తన మొదటి సినిమా టైటిల్ కేదార్ నాథ్‌. సినిమా షూటింగ్‌ కూడా ఎక్కువ శాతం అక్కడే జరిగింది. అందుకే ఆ ప్రాంతం పై ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ కి మక్కువ ఏర్పడింది. అందుకే రెగ్యులర్‌ గా కష్టం అయినా కూడా కేదార్ నాథ్‌ యాత్ర చేస్తూ అక్కడి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటుంది.

తాజాగా మరోసారి సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ యాత్ర చేసినట్లుగా ఆమె సోషల్‌ మీడియా వాల్‌ ను చూస్తే అర్థం అవుతోంది. ఫోటోలు వీడియోలు షేర్ చేసి తన స్నేహితులతో కేదార్ నాథ్ యాత్ర చేసినట్లు పేర్కొంది. సాధారణంగా హీరోయిన్స్ ఒక్కసారి కూడా ఆ సాహస యాత్ర చేసేందుకు సిద్ధపడరు. అలాంటిది మళ్లీ మళ్లీ ఆ యాత్ర చేస్తున్న సారా అలీ ఖాన్ ధైర్యం ను అభినందించాల్సిందే. హీరోయిన్‌ గా ఈస్థాయిలో సారా ఉండటానికి ఆ కేదార్‌ నాథీశ్వరుడి దయే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకే సారా అలీ ఖాన్ ఈ యాత్ర చేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News