సారా టెండూల్కర్‌తో జాన్వీ ప్రియుడు షికార్!
వీడియో లో శిఖర్ డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చోగా సారా వెనుక సీట్ లో కూర్చుని కనిపించింది. శిఖర్ మెరూన్ క్యాప్ తెల్లటి చొక్కా ధరించి కనిపించగా, సారా మెరిసే నల్లటి దుస్తులలో అద్భుతంగా కనిపిస్తోంది.
సెలబ్రిటీ ప్రపంచంలో స్కూల్, కాలేజ్ డేస్ స్నేహాలు టీనేజీ ప్రేమకథలు ప్రజల్లో చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటి ప్రేమకథలు ఇప్పుడు ముంబై ధీరూభాయి అంబానీ స్కూల్ కాలేజ్ లలో బయటపడుతూనే ఉన్నాయి. పాపులర్ ముంబై సెలబ్రిటీ కిడ్స్ అంబానీ స్కూల్ లో చదువుకోవడమే కాదు.. అక్కడ స్టడీ కొనసాగుతున్న సమయంలోనే డేటింగులు చేయడంపైనా బోలెడంత చర్చ ఉంది.
అదే కోవలో అంబానీ కార్పొరెట్ స్కూల్ లోనే స్టడీస్ కొనసాగించిన సారా టెండూల్కర్ , జాన్వీ కపూర్ తమ చిన్న నాటి స్నేహితులకు టచ్ లో ఉన్నారు. ఆ ఇద్దరూ ధీరూభాయ్ అంబానీ స్కూల్ లోనే స్టడీస్ కొనసాగించారు. ప్రస్తుతం తమ స్నేహితులకు ఇంకా టచ్ లోనే ఉన్నారు. ముఖ్యంగా సారా టెండూల్కర్ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో స్నేహం చేయడంపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇంతలోనే జాన్వీ కపూర్ ప్రముఖ రాజకీయ నాయకుడి వారసుడు శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తోందని ముంబై మీడియా కథనాలు ప్రచురిస్తోంది.
వారి మధ్య ఉన్నది కేవలం స్నేహమేనా? అంతకుమించి ఏదైనా ఘాడమైన రిలేషన్ షిప్ ఉందా? అన్నదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఓ పార్టీ నుంచి లీకైన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ .. జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియా అర్థరాత్రి పార్టీ తర్వాత కలిసి కారులో ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. శిఖర్ ప్రస్తుతం నటి జాన్వీ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నాడు. కాగా సారా.. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. తాజాగా రివీలైన వీడియో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు.
వీడియో లో శిఖర్ డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చోగా సారా వెనుక సీట్ లో కూర్చుని కనిపించింది. శిఖర్ మెరూన్ క్యాప్ తెల్లటి చొక్కా ధరించి కనిపించగా, సారా మెరిసే నల్లటి దుస్తులలో అద్భుతంగా కనిపిస్తోంది. ఈవెంట్ నుండి కలిసి వెళుతూ ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. చాలా మంది నెటిజన్లు ముఖ్యంగా జాన్వీ - శుభ్మాన్ల ప్రతిచర్యలపై ఆశ్చర్యపోతున్నారు. నెటిజనుల్లో ఒకరు.. జాన్వీ - గిల్ ఆ కార్నర్లో ఏడుస్తున్నారు! అని పేర్కొన్నారు. గిల్ స్పందన ఎలా ఉంటుందో ఊహించుకునేందుకు ఓ నెటిజన్ కబీర్ సింగ్ రిఫరెన్స్ ఇచ్చాడు. "వానా వూ వన్నా వావూ... శుభ్‌మన్ గిల్" అని వ్యాఖ్యను రాసాడు. ఒక నెటిజన్ మోయే మోయే టు శుభ్‌మాన్ అన్నారు. ఒక నెటిజన్, "జాన్వీతో గిల్ జనామోదం పొందలేదు" అని రాసాడు.
సారా -శుభ్‌మాన్ తమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ ఈ జోడీ ప్రేమ పడవ బలంగా సాగుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మరోవైపు శిఖర్‌తో డేటింగ్ గురించి జాన్వీ చాలా ఓపెన్‌గా చెప్పింది. కొంతకాలం క్రితం ఈ జంట విడిపోయినప్పటికీ మళ్లీ రాజీ కుదిరింది.