సరిపోదా శనివారం.. మరో క్రేజీ బీట్

వీలైనంత ఎక్కువ మందికి సరిపోదా శనివారం సినిమాని రీచ్ చేయాలని అనుకుంటున్నారు.

Update: 2024-08-25 03:37 GMT

నాచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న మాస్ యాక్షన్ డ్రామా మూవీ సరిపోదా శనివారం. ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని నాని జెట్ స్పీడ్ తో చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలు తిరిగేస్తూ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి సరిపోదా శనివారం సినిమాని రీచ్ చేయాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి అదిరిపోయే సంగీతం అందించినట్లు కనిపిస్తోంది. మలయాళంలో నుంచి వచ్చిన వారిలో గోపీ సుందర్ తర్వాత ఇప్పుడు బాగా వినిపిస్తోన్న పేరు జేక్స్ బిజోయ్. తెలుగులో చాలా సినిమాలకి ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. మెలోడీ, రాక్, మాస్ ఏదైనా కూడా కంపోజ్ చేసి ప్రేక్షకులని అలరించడంతో జేక్స్ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది.

మ్యూజిక్ లో కొత్తదనం కోరుకుంటున్న వారు జేక్స్ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. సరిమప అంటూ సాగే ఈ పాటని స్టార్ సింగర్ కార్తీక్ ఆలపించారు. సనరే ఈ పాటకి లిరిక్స్ అందించారు. దీనిని సరిపోదా శనివారం సినిమా ప్రమోషనల్ కంటెంట్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. విజువల్ గా ఈ సాంగ్ ని లాంచ్ చేశారు. బ్యాండ్ పార్టీ సాంగ్ ప్లే చేస్తూ ఉండగా హీరో, హీరోయిన్ మధ్యలో హుషారుగా డాన్స్ చేయడం సాంగ్ లో చూపించారు.

అలాగే సినిమాలో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ లవ్ జర్నీకి సంబందించిన విజువల్స్ ని యాడ్ చేశారు. నెక్స్ట్ ఒక థీమ్ పార్టీలోకి సాంగ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ మధ్య డాన్స్ మూమెంట్స్ తో సాంగ్ ని డిజైన్ చేశారు. విజువల్ గా ఈ సాంగ్ ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉందనే మాట వినిపిస్తోంది. జేక్స్ బిజోయ్ కూడా కాస్తా రెట్రో స్టైల్ మిక్స్ చేసి ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు కనిపిస్తోంది.

నాని ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది. మూవీ ప్రమోషన్స్ కి ఈ సాంగ్ మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో సరిపోదా శనివారం సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. దసరాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని నాని ప్రయత్నం చేశారు. అయితే ఒక్క తెలుగులోనే దసరా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సరిపోదా శనివారం మాత్రం అన్ని భాషలలో క్లిక్ అవుతుందని భావిస్తున్నారు.

Full View
Tags:    

Similar News