సరిపోదా శనివారం… ఓటీటీలో క్లిక్కయ్యిందా? లేదా?
అయితే ఆ వైబ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎందుకనో రిఫ్లెక్ట్ కాలేదని చెప్పాలి.
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ కమర్షియల్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ తర్వాత ‘సరిపోదా శనివారం’ మూవీతో నాని హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ తర్వాత మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. అయితే ఆ వైబ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎందుకనో రిఫ్లెక్ట్ కాలేదని చెప్పాలి.
మేకర్స్ లెక్కల ప్రకారం అయితే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ట్రేడ్ పండితులు మాత్రం ఓవరాల్ కలెక్షన్స్ 90 కోట్ల వరకు ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ‘సరిపోదా శనివారం’ థియేటర్స్ లో ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసింది. చిన్న చిన్న లోపాలు ఉన్న ఓవరాల్ గా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యారని కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల ఎఫెక్ట్ కూడా సినిమా కలెక్షన్స్ డ్రాప్ కావడానికి ఒక కారణం అనే మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలోకి వచ్చింది. ఒక సినిమాని ఆడియన్స్ థియేటర్స్ లో చూసే విధానానికి ఓటీటీలో వీక్షించే దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటుంటారు. ఇంట్లో కూర్చొని తీరిగ్గా ఓటీటీలో సినిమాని ఆశ్వాదిస్తూ ఉంటారు. ఎక్కడైన నచ్చని అంశాలు ఉంటే వెంటనే ఫార్వార్డ్ కొట్టేస్తారు. ‘సరిపోదా శనివారం’ సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిందనే మాట వినిపిస్తోంది.
ఓటీటీ ఆడియన్స్ ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎస్ జె సూర్య పెర్ఫార్మెన్స్, జెక్స్ బిజోయ్ సంగీతాన్ని బాగా ఆశ్వాదిస్తారంట అలాగే నాని పెర్ఫార్మెన్స్ కి కనెక్ట్ అయ్యారు. అయితే యాక్షన్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదంట. సెకెండాఫ్ కూడా ల్యాగ్ ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీక్వెన్స్ కూడా రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుందని టాక్. దాంతో పాటు ఓల్డ్ ఫార్ములలో వివేక్ ఆత్రేయని కథని నేరేట్ చేయడం కూడా డిజిటల్ ఆడియన్స్ ని కన్విన్స్ చేయలేదని మరొక టాక్ వస్తోంది.
ఓవరాల్ గా ఓటీటీలో ‘సరిపోదా శనివారం’ యావరేజ్ టాక్ తెచ్చుకుందనే మాట వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని సినిమాలు ఇష్టపడే వారు మాత్రం సరిపోదా శనివారం సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ తో నాని నుంచి నెక్స్ట్ రాబోయే ‘హిట్ 3’ చిత్రమైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.