నాని.. అస్సలు ఖాళీ లేకుండా..

గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

Update: 2024-08-20 11:31 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. కెరీర్ విషయంలో కరెక్ట్ గా ఆలోచిస్తూ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 29వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్.. అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఆ సినిమా.. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

దీంతో కొద్ది రోజులుగా నాని ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ చాలా ముఖ్యం. పాన్ ఇండియా చిత్రానికి మరింతగా చేయాలి. అప్పుడే అన్ని భాషల్లో వేరే లెవల్ లో అంచనాలు క్రియేట్ అవుతాయి. అందుకే నాని.. తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డైరెక్టర్ అండ్ కో బిజీగా ఉండడంతో హీరోయిన్, విలన్ తో అంతా చుట్టేస్తూ గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.

రీసెంట్ గా హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, నటుడు ఎస్ జే సూర్యతో కలిసి చెన్నైలో మూడు రోజుల పాటు వివిధ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు నాని. తమిళ మీడియా సపోర్ట్ తో కోలీవుడ్ ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. చెన్నై వెళ్లకముందే తెలుగులో ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే మిగతా లాంగ్వేజెస్ లో ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక.. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నారు నాని. అందుకు గాను పెద్ద ప్లానే వేసుకున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయనున్నారు నాని. కొచ్చికి వెళ్లి అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనున్నారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి కన్నడ వెర్షన్ కు గాను ప్రమోట్ చేయనున్నారు. అనంతరం ముంబైలో ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మొత్తానికి నాని వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. మరి సరిపోదా శనివారంతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News