ప్రభాస్ పై జోకర్ కామెంట్.. కల్కి యాక్టర్ ఏమన్నారంటే?

తాజాగా దీనిపై కల్కి మూవీలో కమాండర్ రోల్ పోషించిన సస్వత్ ఛటర్జీ స్పందించారు. కల్కి చిత్రానికి ప్రభాస్ బెస్ట్ సెలెక్షన్ అని కొనియాడారు.

Update: 2024-08-23 09:28 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ లుక్ పై ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వ్యవహారం ఎంతటి వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఆ విషయంపైనే చర్చ నడుస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ కు వస్తున్న క్రేజ్ ను తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగు నటీనటులు కూడా వార్సీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

 

టాలీవుడ్ తోపాటు సౌత్ లోని మిగతా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖలు కూడా స్పందిస్తున్నారు. ప్రభాస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తోటి హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు. తమదైన శైలిలో స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలోని ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని వార్సీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా దీనిపై కల్కి మూవీలో కమాండర్ రోల్ పోషించిన సస్వత్ ఛటర్జీ స్పందించారు. కల్కి చిత్రానికి ప్రభాస్ బెస్ట్ సెలెక్షన్ అని కొనియాడారు. తాను అర్షద్ గురించి ఏమీ కూడా మాట్లాడాలని అనుకోవడం లేదని తెలిపారు. అది అతడి అభిప్రాయం మాత్రమేనని, అందరిదీ కాదని, తనది కూడా కాదని చెప్పారు. కల్కి మూవీలో ప్రభాస్ లుక్ సూపర్ అని తెలిపారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ లో ఉంటుందని ప్రశంసలు కురిపించారు.

అయితే ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది సలార్ తో మంచి హిట్ అందుకున్న ఆయన.. 2024లో కల్కితో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. భైరవగా, కర్ణుడిగా అలరించారు. తన యాక్షన్ తో మెప్పించారు. నేషనల్ వైడ్ గా ఉన్న తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన కల్కి భారీ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.

ఇటీవల ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో అధికారంగా ప్రారంభమైంది. ఆ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ మూవీపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు ప్రభాస్ చేతిలో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్-2 చిత్రాలు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ మూవీతో ప్రభాస్.. వార్సీకి గట్టి ఆన్సర్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News